Republic Day 2022: రిపబ్లిక్ డే గురించి చాలామందికి తెలియని 10 ఆసక్తికరమైన విషయాలు..?

Republic Day 2022: భారత రాజ్యాంగం 26 జనవరి 1950 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జనవరి 26 తేదీ చాలా ప్రత్యేకమైనది. ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.

Republic Day 2022: రిపబ్లిక్ డే గురించి చాలామందికి తెలియని 10 ఆసక్తికరమైన విషయాలు..?
Republic Day Celebration
Follow us
uppula Raju

|

Updated on: Jan 26, 2022 | 11:59 AM

Republic Day 2022: భారత రాజ్యాంగం 26 జనవరి 1950 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జనవరి 26 తేదీ చాలా ప్రత్యేకమైనది. ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్‌పథ్‌లో కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ రోజు భారతదేశం తన 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రిపబ్లిక్ డేకి సంబంధించిన చాలా మందికి తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

1. జనవరి 26, 1929న భారత జాతీయ కాంగ్రెస్ భారత స్వరాజ్యాన్ని ప్రకటించింది. అందువల్ల భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి జనవరి 26 తేదీని ఎంచుకున్నారు.

2. జనవరి 1948లో భారత రాజ్యాంగం మొదటి ముసాయిదా చర్చ కోసం సమర్పించారు. చర్చ 4 నవంబర్ 1948న ప్రారంభమై 32 రోజుల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా 7,635 సవరణలు ప్రతిపాదించగా అందులో 2,473 సవరణలను వివరంగా చర్చించారు. రాజ్యాంగాన్ని ఖరారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.

3. రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని నియమించారు. ముసాయిదా కమిటీ చివరి సెషన్ 26 నవంబర్ 1949న ముగిసింది. అందరి సమ్మతితో రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఇది 1950 జనవరి 26న దేశంలో అమలులోకి వచ్చింది.

4. జనవరి 26న జరిగే పరేడ్ సందర్భంగా రాష్ట్రపతికి 21 తుపాకుల గౌరవ వందనం ఇవ్వడం ఆనవాయితీ. వీటిని ’25 పౌండర్లు’ అని పిలుస్తారు. జాతీయ గీతం ప్రారంభమైన వెంటనే మొదటి వందనం సరిగ్గా 52 సెకన్ల తర్వాత చివరి వందనం ఉంటుంది.

5. రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా హిందీలో, ఆంగ్లంలో రాశారు. ఇది రాయడానికి అతనికి ఆరు నెలలు పట్టింది. ఈ పని కోసం భారత ప్రభుత్వం అతనికి రాజ్యాంగ సభలో ఒక గదిని కేటాయించింది.

6. రాజ్యాంగాన్ని రచించినందుకు ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా ప్రభుత్వం నుంచి ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. రాజ్యాంగంలోని ప్రతి పేజీలో తన పేరు రాయాలని చివరి పేజీలో తనతో పాటు తన తాత పేరు కూడా రాయాలని డిమాండ్‌ చేశారు.

7. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన, వివరణాత్మక రాజ్యాంగం. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా రాజ్యాంగంలోని ప్రతి పేజీని అందమైన చేతిరాత, ఇటాలిక్‌లతో రాశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఇది మొత్తం 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్లను కలిగి ఉంది. ఈ రాజ్యాంగం 22 భాగాలుగా విభజించబడింది.

8. ప్రతి సంవత్సరం జనవరి 26న జరిగే పరేడ్‌లో ఏదో ఒక దేశపు దేశాధినేతను అతిథిగా పిలుస్తారు. 1950 జనవరి 26న జరిగిన మొదటి పరేడ్‌లో ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్ణోని అతిథిగా ఆహ్వానించారు.

9. 1950 నుంచి 1954 వరకు రిపబ్లిక్ డే వేడుకలు ఇర్విన్ స్టేడియం (ప్రస్తుతం నేషనల్ స్టేడియం అని పిలుస్తారు), కింగ్స్‌వే, రెడ్ ఫోర్ట్, రాంలీలా మైదాన్‌లో జరిగాయి. 1955 నుంచి రాజ్‌పథ్‌లో నిర్వహించడం ప్రారంభించారు. 1955లో రాజ్‌పథ్‌లో జరిగిన మొదటి పరేడ్‌కు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్‌ను అతిథిగా ఆహ్వానించారు.

10. రిపబ్లిక్ డే అనేది మూడు రోజుల జాతీయ పండుగ. ఇది బీటింగ్ రిట్రీట్ వేడుకతో జనవరి 29న ముగుస్తుంది.

Career News: విద్యార్థులు అలర్ట్‌.. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గరపడ్డాయ్.. మెరుగైన ఫలితాల కోసం ఇలా చేయండి..

SBI PO మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..?

Republic Day 2022: ఈ దేశభక్తి సినిమాలు చాలా ఫేమస్‌.. ఎన్నిసార్లు చూసినా మళ్లీ కొత్తగానే..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే