Republic Day 2022: ఈ దేశభక్తి సినిమాలు చాలా ఫేమస్‌.. ఎన్నిసార్లు చూసినా మళ్లీ కొత్తగానే..?

Republic Day 2022: భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అంటే జనవరి 26, 1950న రాజ్యాంగం ఏర్పడింది.

Republic Day 2022: ఈ దేశభక్తి సినిమాలు చాలా ఫేమస్‌.. ఎన్నిసార్లు చూసినా మళ్లీ కొత్తగానే..?
Best Patriotic Movies
Follow us
uppula Raju

|

Updated on: Jan 26, 2022 | 10:04 AM

Republic Day 2022: భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అంటే జనవరి 26, 1950న రాజ్యాంగం ఏర్పడింది. అందుకే భారతదేశ ప్రజలు అధికారికంగా ఈ రోజును తమ దేశానికి స్వాతంత్ర్యంగా భావిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో గ్రాండ్ పరేడ్ నిర్వహిస్తారు. ఛానెల్స్‌ అన్నీ లైవ్ టెలికాస్ట్ చేస్తాయి. మరోవైపు టీవీల్లో దేశభక్తి సినిమాలు మారుమోగుతుంటాయి. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి. వీటిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఆనందం దొరుకుతుంది. అలాంటి కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.

50వ దశకం నుంచి దేశభక్తి చిత్రాల శకం మొదలైంది

50, 60 దశకాలలో స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్రానంతరం రైతుల సమస్యలను చూపించే సినిమాలు కొన్ని వచ్చాయి. వీటిలో ‘నయా దౌర్’, ‘ఉప్కార్’, ‘షహీద్’ వంటి చిత్రాలు ఉన్నాయి. భారతదేశం బ్రిటీష్‌ వారితో ఎలా పోరాడింది. కొత్త భారతదేశానికి సోషలిజం, సమానత్వం, లౌకికవాదం ఎలా అవసరమో ఈ చిత్రాలు తెలిపాయి. దీని తర్వాత ‘పురబ్ ఔర్ పశ్చిమ్’, ‘రోటీ కప్దా ఔర్ మకాన్’, ‘క్రాంతి’, ‘జానే భీ దో యారో’, ‘ఎర్త్ సత్య’ వంటి చిత్రాలు 70-80లలో వచ్చాయి. భారతీయ సంస్కృతి నుంచి దేశ రాజకీయాల వరకు అవినీతి, పెట్టుబడిదారీ విధానం, చీకటి వాస్తవికతను బహిర్గతం చేయడానికి ఈ చిత్రాలు ఉపయోగపడ్డాయి.

80వ దశకం తర్వాత భారతీయ సినిమా మూడ్‌లో స్వల్ప మార్పు వచ్చింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధంపై దేశభక్తి భావన స్థిరపడింది. ‘బోర్డర్’, ‘లక్ష్య’, ‘గదర్’ వంటి చిత్రాలు 90వ దశకం, 2000వ దశకం ప్రారంభంలో వచ్చాయి. ఈ మూడు సినిమాలూ పాకిస్థాన్‌తో భారతదేశం చేసే యుద్ధం నేపథ్యంలో రూపొందినవే. అయితే ‘గదర్’ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది విభజన తర్వాత జరిగిన మారణకాండను చిత్రీకరించడమే కాకుండా, పాకిస్థానీ, భారతీయుల ప్రేమకథ కోణాన్ని కూడా ఆవిష్కరించింది.

నేటికీ ప్రజలు ‘బోర్డర్’, ‘గదర్’ చిత్రాలను ఉత్సాహంగా చూస్తారు. మరోవైపు రాజస్థాన్‌లోని లోంగేవాలాలో 1971లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధ జ్ఞాపకాలను పురస్కరించుకుని ‘బోర్డర్’ సినిమా తెరకెక్కింది. 120 మంది భారత సైనికుల ముందు 2 వేల మంది పాకిస్తానీ సైనికులు ఎలా మోకరిల్లారనేది ఈ చిత్రం ద్వారా చూపించారు. 2000 సంవత్సరంలో సినీ ప్రేమికులు ‘రంగ్ దే బసంతి’, ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ సినిమాలు కూడా ప్రేక్షకుల్లో చెరగని ముద్రని వేశాయి.

ఒకవైపు ‘రంగ్ దే బసంతి’లో తమ దేశంలోనే భారత సైనికుల హేయమైన చర్యను చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు, అజయ్ దేవగన్ ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ దేశ స్వాతంత్ర్యం కోసం తన తోటి రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో కలిసి 23 సంవత్సరాల వయస్సులో ఉరి వేసుకున్న యువకుడి కథను అందించింది. దేశభక్తిని పెంపొందించే సినిమాల నిర్మాణం ఇప్పటికీ ఆగలేదు. గత కొన్నేళ్లుగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల కథలను తెరపై చూపిస్తూనే ఉన్నారు. అలాంటి చిత్రాలలో ‘రాజీ’, ‘బెల్ బాటమ్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘కేసరి’, ‘షేర్ షా’ వంటి చిత్రాలు ఉన్నాయి.

Republic Day 2022: రిపబ్లిక్ డే స్పెషల్ వంటకాలు.. ఇంట్లోనే తయారు చేయండి..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఉద్యోగం మానేసిన తేదీని మీరే అప్‌డేట్‌ చేసుకోండి..?

Home Loan: మొదటిసారి ఇల్లు కొంటున్నారా.. 5 లక్షల పన్ను మినహాయింపు..?

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!