AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఉద్యోగం మానేసిన తేదీని మీరే అప్‌డేట్‌ చేసుకోండి..?

EPFO: మీరు ఒక కంపెనీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరొక కంపెనీలో చేరినట్లయితే మీరు ఉద్యోగం మానేసిన తేదీని EPF ఖాతాలో అప్‌డేట్ చేసుకోవచ్చు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఉద్యోగం మానేసిన తేదీని మీరే అప్‌డేట్‌ చేసుకోండి..?
Pf Money
uppula Raju
|

Updated on: Jan 26, 2022 | 9:04 AM

Share

EPFO: మీరు ఒక కంపెనీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరొక కంపెనీలో చేరినట్లయితే మీరు ఉద్యోగం మానేసిన తేదీని EPF ఖాతాలో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ పనిని ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో చేయవచ్చు. దీని కోసం మీరు EPFO ​​కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఈపీఎఫ్‌వో ఓ ట్వీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. EPFO తన సభ్యులకు కంపెనీ నుంచి నిష్క్రమించిన తేదీని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. దీన్ని ఎలా చేయాలో ఉద్యోగులకు చెప్పడానికి ఒక వీడియోను కూడా విడుదల చేసింది. మీరు ఈ వీడియోను చూడటం ద్వారా ఆన్‌లైన్ నిష్క్రమణ తేదీని అప్‌డేట్ చేయవచ్చు.

మీరు వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరి పీఎఫ్‌ని బదిలీ చేయాలనుకుంటే అంతకు ముందు పాత కంపెనీ నుంచి ఉద్యోగం మానేసిన తేదీని ఈపీఎఫ్ ఖాతాలో అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌ఓ చెబుతోంది. ఉద్యోగం మానేసిన తర్వాత రెండు నెలల వరకు మాత్రమే ఈ తేదీని అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు ఉద్యోగం నుంచి నిష్క్రమిస్తున్న నెలలో ఏ తేదీన అయినా మీరు EPF ఖాతాను అప్‌డేట్ చేయవచ్చు. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP నుంచి తేదీని అప్‌డేట్‌ చేసే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కాబట్టి UAN నెంబర్‌ని ఆధార్‌తో లింక్ చేసిన వ్యక్తులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందుతారు. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసినట్లయితే EPF OTP అదే నంబర్‌కి వస్తుంది. అదే OTP సహాయంతో ఉద్యోగం నుంచి నిష్క్రమించే తేదీని అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఈ విధంగా చేయండి..

1. UAN, పాస్‌వర్డ్‌తో https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/కి లాగిన్ చేయండి

2. మేనేజ్ బటన్‌పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్‌పై క్లిక్ చేయండి. ఎంప్లాయ్‌మెంట్ డ్రాప్‌డౌన్‌ని ఎంచుకోవడం ద్వారా PF ఖాతా నంబర్‌ను ఎంచుకోండి

3. నిష్క్రమణ తేదీ, ఉద్యోగం నుంచి నిష్క్రమించడానికి గల కారణాన్ని తెలపండి.

4. రిక్వెస్ట్ OTPపై క్లిక్ చేసి ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్‌లో అందుకున్న OTPని నమోదు చేయండి

5. చెక్ బాక్స్‌ని ఎంచుకుని అప్‌డేట్‌పై క్లిక్ చేసి ఆపై ఓకేపై క్లిక్ చేయండి

6. తర్వాత మీరు మునుపటి కంపెనీ నుంచి ఉద్యోగం మానేసిన తేదీని విజయవంతంగా అప్‌డేట్‌ చేసినట్లు మీ మొబైల్‌కు మెస్సేజ్‌ వస్తుంది.

Home Loan: మొదటిసారి ఇల్లు కొంటున్నారా.. 5 లక్షల పన్ను మినహాయింపు..?

ఈ మహిళా క్రీడాకారులు పోలీస్‌ యూనిఫాం ధరించారు.. కొందరు SP అయితే మరికొందరు DSP..?

Republic Day 2022: రాజ్యంగ నిర్మాణంలో చరిత్ర సృష్టించిన మహిళలు.. ఒకరు మొదటి ముఖ్యమంత్రి అయితే మరొకరు మొదటి గవర్నర్‌..