AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day 2022: రాజ్యంగ నిర్మాణంలో చరిత్ర సృష్టించిన మహిళలు.. ఒకరు మొదటి ముఖ్యమంత్రి అయితే మరొకరు మొదటి గవర్నర్‌..

Republic Day 2022: దేశం ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీని వెనుక ఎంతోమంది మహాత్ముల కృషి దాగి ఉంది. అందులో మహిళలు

Republic Day 2022: రాజ్యంగ నిర్మాణంలో చరిత్ర సృష్టించిన మహిళలు.. ఒకరు మొదటి ముఖ్యమంత్రి అయితే మరొకరు మొదటి గవర్నర్‌..
Flag
uppula Raju
|

Updated on: Jan 26, 2022 | 7:43 AM

Share

Republic Day 2022: దేశం ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీని వెనుక ఎంతోమంది మహాత్ముల కృషి దాగి ఉంది. అందులో మహిళలు కూడా ఉన్నారు. దేశంలోని గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. అందులో 15 మంది మహిళా సభ్యులు ఉండటం విశేషం. అందులో ఇద్దరు దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించిన మహిళా సభ్యులు ఉన్నారు.

స్వతంత్ర భారతదేశం కోసం బలమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి 15 మంది మహిళలు కూడా రాజ్యాంగ సభ కమిటీలో పనిచేశారు. వారిలో 13 మంది మహిళలు ఉన్నత వర్గాలకు చెందినవారు. ఇద్దరు మహిళలు ఒక ముస్లిం, ఒక దళిత మహిళ ఉన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో మొత్తం 389 మంది పాల్గొన్నారు. మహిళా సభ్యులు సుచేతా కృప్లానీ, మాలతీ చౌదరి, విజయలక్ష్మి పండిట్, సరోజినీ నాయుడు, రాజ్‌కుమారి అమృత్ కౌర్, లీలా రాయ్, బేగం ఎజాజ్ రసూల్, కమలా చౌదరి, హంసా మెహతా, రేణుకా రే, దుర్గాబాయి దేశ్‌ముఖ్, అమ్ము స్వామినాథన్, పూర్ణిమా బెనర్జీ, దక్షా బెనర్జీ, పూర్ణిమా బెనర్జీ ఉన్నారు.

కమిటీలో ఏకైక దళిత మహిళ దాక్షాయణి వేలాయుధన్‌

దాక్షాయణి వేలాయుధన్ కేరళకు చెందిన 34 ఏళ్ల దళిత మహిళ. ఈ కమిటీలోని అతి పిన్న వయస్కుల్లో ఆమె ఒకరు. ఆమె సమాజం నుంచి పాఠశాల, కళాశాలకు వెళ్ళిన మొదటి అమ్మాయి. తరువాత ఆమె భారతదేశపు మొదటి మహిళా దళిత గ్రాడ్యుయేట్ కూడా అయ్యింది. ముస్లిం సమాజం నుంచి వచ్చిన మహిళ కూడా ఉంది. ఆమె పేరు బేగం ఎజాజ్ రసూల్. ఈ మహిళా బృందంలో విజయలక్ష్మి పండిట్‌తో పాటు సుచేతా కృప్లానీ, సరోజినీ నాయుడు వంటి ప్రముఖ మహిళలు ఉన్నారు. సరోజినీ నాయుడు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు.

పోరాట సమయంలో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. మహాత్మాగాంధీతో సన్నిహితంగా మెలిగిన సరోజిని ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ అయ్యారు. ఆమె గవర్నరు కావడమే కాకుండా దేశంలోనే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా నాయకురాలు కూడా అయ్యారు. ఆమె 1947 ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. 2 మార్చి 1949 వరకు ఈ పదవిలో కొనసాగారు. అంటే మొత్తం 1 సంవత్సరం 199 రోజుల పాటు ఆమె గవర్నర్ పదవిని అలంకరించారు.

16 ఏళ్ల తర్వాత ఈసారి సీఎం రికార్డు సృష్టించారు

రాజ్యాంగ సభలో సరోజినీ నాయుడుతో కలిసి పనిచేసిన సుచేతా కృప్లానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 16 ఏళ్ల తర్వాత భారత రాజకీయాల్లో మహిళల పక్షాన సరికొత్త రికార్డ్‌ని నమోదు చేసింది. దేశంలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళా నాయకురాలు ఆమె. సుచేత 2 అక్టోబర్ 1963 న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 13 మార్చి 1967 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఆమె లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ దేశ చరిత్రలో సృష్టించిన రికార్డు భవిష్యత్తులో మహిళలు ముందుకు సాగేందుకు బాటలు వేసింది.

ఈ కమిటీలో ఉన్న దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆ తర్వాత ఎంపీ అయ్యారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సోదరి విజయ్ లక్ష్మి పండిట్ కూడా రాజ్యాంగ కమిటీలో పనిచేశారు తరువాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తరువాత లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ కమిటీలో మరొక పెద్ద పేరు రాజకుమారి అమృత్ కౌర్, నెహ్రూ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్థాపనకు గణనీయమైన కృషి చేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆమె దేశ ఆరోగ్య మంత్రిగా కొనసాగారు.

Flag Hosting Rules: జెండా ఎగరవేయాలంటే నిబంధనలు తెలుసా.. ఎప్పుడు పడితే అప్పుడు ఎగరవేయకూడదు..?

Dwayne Bravo: మైదానంలో ‘పుష్ప’ స్టెప్ వేసిన డ్వేన్ బ్రావో.. పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్‌..

Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ తండ్రి అయ్యాడు.. పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హేజెల్ కీచ్..