Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dwayne Bravo: మైదానంలో ‘పుష్ప’ స్టెప్ వేసిన డ్వేన్ బ్రావో.. పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్‌..

Dwayne Bravo: టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' గత నెల డిసెంబర్‌లో విడుదలైంది. ఈ సినిమా ఎఫెక్ట్‌ ఇప్పటికీ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.

Dwayne Bravo: మైదానంలో 'పుష్ప' స్టెప్ వేసిన డ్వేన్ బ్రావో.. పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్‌..
Dwayne Bravo
Follow us
uppula Raju

|

Updated on: Jan 26, 2022 | 6:41 AM

Dwayne Bravo: టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ గత నెల డిసెంబర్‌లో విడుదలైంది. ఈ సినిమా ఎఫెక్ట్‌ ఇప్పటికీ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. సినిమా మాత్రమే కాదు ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్లు ఈ సినిమాపై వీడయోలు చేస్తున్నారు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా ఈ సినిమాని చూసినట్లున్నాడు. అందుకే అల్లు అర్జున్ తరహాలో పుష్ప స్టెప్‌ వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డ్వేన్ బ్రావో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ఉండవచ్చు కానీ అతను సోషల్ మీడియాలో, ప్రపంచవ్యాప్తంగా వివిధ T20 లీగ్‌లలో ఆడటం ద్వారా తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల కాలంలో కూడా అతడికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో వికెట్ తీసిన తర్వాత బ్రావో మైదానంలోనే పుష్ప స్టెప్‌ వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌తో జరిగిన 18వ ఓవర్ ఐదో బంతికి డ్వేన్ బ్రావో.. మహిదుల్ ఇస్లామ్‌ను ఔట్‌ చేశాడు. వికెట్ తీసుకున్న ఆనందంలో బ్రావో పుష్ప స్టెప్ చేస్తూ కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్‌ని కొంత వరకు కాపీ కొట్టడంలో డ్వేన్ బ్రావో సక్సెస్ అయ్యాడు. ఇంతకుముందు డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలోని పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతని కుమార్తెలు కూడా డ్యాన్స్‌ చేశారు. వార్నర్ స్వయంగా ఒక వీడియోను రూపొందించారంటే ఈ సినిమా ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ తండ్రి అయ్యాడు.. పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హేజెల్ కీచ్..

Viral Photos: ఇండియాలోని ఈ ప్రాంతాలలో శీతాకాలంలో వేసవి అనుభూతిని పొందవచ్చు..

Sport Bikes: బైక్ అంటే ఇష్టమా.. లక్షలోపు వచ్చే బైకుల గురించి తెలుసుకోండి..?