uppula Raju |
Updated on: Jan 24, 2022 | 4:34 PM
గోవా: భారతదేశంలోని గొప్ప పర్యాటక ప్రాంతం గోవా. ఏ సీజన్‌లోనైనా ఇక్కడ ఆనందించవచ్చు. మీరు కుటుంబం, స్నేహితులు లేదా సోలో ట్రిప్‌ని ద్వారా కూడా ఆనందించవచ్చు.
ముంబయి: సముద్రానికి ఆనుకుని ఉండడం వల్ల ఉత్తర భారతంలో ఉన్నంత చలి ముంబైకి రాదు. ఇక్కడ అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. తక్కువ బడ్జెట్‌లో సిటీ ట్రిప్‌లు పూర్తి చేయొచ్చు.
కూర్గ్: దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఈ ప్రదేశం శీతాకాలంలో ఇతర ప్రదేశాల కంటే కొంచెం వెచ్చగా ఉంటుంది. ఇక్కడి ప్రాంతాల సహజ అందాలు పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి.
కచ్: గుజరాత్‌లోని ఈ ప్రదేశం ప్రయాణికులకు చాలా ఇష్టం. చలికాలంలో ఇక్కడికి వెళ్లడం ఒక విభిన్నమైన వినోదం. ఇక్కడ ఈ సమయంలో రణ్ మహోత్సవ్‌లో జరుగుతుంది.
జైసల్మేర్: ఇక్కడి చారిత్రక వారసత్వం, సంస్కృతి ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చలి చాలా తక్కువగా ఉంటుందని చెబుతారు.