Home Loan: మొదటిసారి ఇల్లు కొంటున్నారా.. 5 లక్షల పన్ను మినహాయింపు..?

Home Loan: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. గృహ రుణంపై వడ్డీ, అసలు రెండింటిపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయోజనాన్ని

Home Loan: మొదటిసారి ఇల్లు కొంటున్నారా.. 5 లక్షల పన్ను మినహాయింపు..?
Home Purchase
Follow us
uppula Raju

|

Updated on: Jan 26, 2022 | 8:42 AM

Home Loan: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. గృహ రుణంపై వడ్డీ, అసలు రెండింటిపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయోజనాన్ని ఆదాయపు పన్నులోని వివిధ విభాగాలలో చూడవచ్చు. గృహ రుణంపై రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపును సులభంగా పొందవచ్చు . సెక్షన్ 80C కింద లభించే రూ. 1.5 మినహాయింపు ఉన్నప్పటికీ ఇది కాకుండా గృహ రుణ వడ్డీ, అసలుపై పన్నును ఆదా చేసే కొన్ని విభాగాలు ఉన్నాయి.

ఒక వ్యక్తి గృహ రుణం తీసుకుని అసలు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే అతను దానిపై పన్ను మినహాయింపు పొందుతాడు. షరతు ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అధికార పరిధిలోకి వచ్చే సంస్థ నుంచి మాత్రమే రుణం తీసుకోవాలి. ఇల్లు నిర్మాణంలో ఉన్నట్లయితే దానిపై పన్ను మినహాయింపు ఉండదని గుర్తుంచుకోండి. మీరు లోన్ తీసుకున్న ఇంటిని లోన్ తీసుకున్న 5 సంవత్సరాలలోపు అమ్మలేరు. మీరు విక్రయిస్తే మీ మొత్తం ఆదాయంపై పన్ను విధిస్తారు.

వడ్డీ రాయితీ

సెక్షన్ 24 ప్రకారం గృహ రుణంపై చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల రాయితీ ఉంటుంది. ఈ రుణం మీ ఆస్తిపై తీసుకోవాలి. ఆస్తిని అద్దెకు ఇచ్చి దానిపై గృహ రుణం తీసుకుంటే మొత్తం వడ్డీకి మినహాయింపు ఉంటుంది. ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయినప్పుడే ఈ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంటి నిర్మాణ సమయంలో రుణంపై వడ్డీని చెల్లించినట్లయితే ఇంటి నిర్మాణం తర్వాత దానిని 5 వేర్వేరు వాయిదాలలో క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఎంత తగ్గింపు పొందుతారు

మీరు 5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందుతారు. మీరు గృహ రుణం తీసుకొని మొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. అంటే ఇంటి నిర్మాణానికి గృహ రుణం తీసుకోవడం లేదు. రెడి-టు-మూవ్ సెక్షన్ 80C కింద అసలు మొత్తంపై రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. సెక్షన్ 24 కింద హోమ్ లోన్ అసలు రీపేమెంట్‌పై రూ. 2 లక్షల రాయితీని పొందవచ్చు. సెక్షన్ 80EEA కింద వడ్డీపై రూ. 1.5 లక్షల అదనపు మినహాయింపు తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మినహాయింపు మొత్తం 5 లక్షలు అవుతుంది.

సెక్షన్ 80EEA నిబంధన 2019 సంవత్సరపు బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. రుణంపై పన్ను మినహాయింపు షరతు ఏంటంటే రుణాన్ని ఏదైనా బ్యాంకు, బ్యాంకింగ్ కంపెనీ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి తీసుకోవాలి. ఈ లోన్ 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చి 2022 మధ్య తీసుకోవాలి. ఆస్తి స్టాంపు డ్యూటీ 45 లక్షలకు మించకూడదు. గృహ రుణం మంజూరు చేసిన తేదీ వరకు రుణదాతకు ఇతర నివాస గృహ రుణం ఉండకూడదు.

ఈ మహిళా క్రీడాకారులు పోలీస్‌ యూనిఫాం ధరించారు.. కొందరు SP అయితే మరికొందరు DSP..?

Republic Day 2022: రాజ్యంగ నిర్మాణంలో చరిత్ర సృష్టించిన మహిళలు.. ఒకరు మొదటి ముఖ్యమంత్రి అయితే మరొకరు మొదటి గవర్నర్‌..

Flag Hosting Rules: జెండా ఎగరవేయాలంటే నిబంధనలు తెలుసా.. ఎప్పుడు పడితే అప్పుడు ఎగరవేయకూడదు..?

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!