Career News: విద్యార్థులు అలర్ట్‌.. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గరపడ్డాయ్.. మెరుగైన ఫలితాల కోసం ఇలా చేయండి..

Career News: బోర్డు ఎగ్జామ్స్ పరీక్షల తేదీలు ప్రకటిస్తున్నారు. మార్చి-ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.

Career News: విద్యార్థులు అలర్ట్‌.. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గరపడ్డాయ్.. మెరుగైన ఫలితాల కోసం ఇలా చేయండి..
Exam Prepration Tips
Follow us
uppula Raju

|

Updated on: Jan 26, 2022 | 11:41 AM

Career News: బోర్డు ఎగ్జామ్స్ పరీక్షల తేదీలు ప్రకటిస్తున్నారు. మార్చి-ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు తమ ప్రిపరేషన్‌పై సీరియస్‌గా దృష్టి సారించాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలో ప్రణాళిక వేసుకోవాలి. CBSE బోర్డ్, CISCE బోర్డ్, ఇతర రాష్ట్రాల బోర్డు విద్యార్థులు ఇప్పుడు మీ సమయాన్ని చదువుపైనే కేంద్రీకరించాలి.

మీ ప్రిపరేషన్‌ని మెరుగుపరచుకోవడానికి ముందుగా మీకు సులభంగా అనిపించే అధ్యాయాలను చదవండి. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది మీ విశ్వాస స్థాయిని పెంచుతుంది. కష్టమైన అధ్యాయాన్ని ముందుగా ప్రారంభిస్తే అందులో ఇరుక్కుపోతారు. మీరు మూడు అధ్యాయాలను సిద్ధం చేసుకోవాలి. మూడూ మీకు సులువుగా ఉన్నాయని అనుకుంటే తర్వాత పరీక్షలో గరిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడిగే అధ్యాయాన్ని చదవాలి.

ఎక్కువగా పాయింట్లపై దృష్టి పెట్టండి..

బోర్డ్ ఎగ్జామ్‌కి సిద్ధమవుతున్నప్పుడు పాయింట్లపై దృష్టిపెడితే మంచిది. చదివిన అధ్యాయాలను మరొకసారి రివైజ్ చేసుకోండి. తద్వారా సమాధానాన్ని గుర్తుంచుకుని పరీక్ష బెస్ట్‌గా రాయవచ్చు. సబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు ముఖ్యమైన పాయింట్లు గుర్తుంచుకుంటే,దీర్ఘ సమాధానాలు రాయడం సులభం అవుతుంది. అందువల్ల సమాధానాలను ఎల్లప్పుడూ చదవాలి. పాయింట్లు చేస్తూ గుర్తుంచుకోవాలి.

చదువుతున్నప్పుడు ఒత్తిడికి గురికావద్దు

పరీక్షల సమయంలో విద్యార్థులు కంగారు పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలో భయాందోళన చెందడం కంటే ప్రశాంతంగా ఉండటం మంచిది. ఎందుకంటే నెర్వస్ నెస్ కారణంగా చదువుపై ఏకాగ్రత కుదరదు. ఈ సమయంలో మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి సాధ్యమైనంతవరకు ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి.

Republic Day 2022: ఈ దేశభక్తి సినిమాలు చాలా ఫేమస్‌.. ఎన్నిసార్లు చూసినా మళ్లీ కొత్తగానే..?

SBI PO మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..?

Republic Day 2022: రిపబ్లిక్ డే స్పెషల్ వంటకాలు.. ఇంట్లోనే తయారు చేయండి..