SBI PO మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..?
SBI PO Mains Result 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI PO మెయిన్స్ ఫలితాలను 2021 ప్రకటించింది. SBI తన అధికారిక సైట్ sbi.co.in లో ఫలితాలను
SBI PO Mains Result 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI PO మెయిన్స్ ఫలితాలను 2021 ప్రకటించింది. SBI తన అధికారిక సైట్ sbi.co.in లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారులు ఇప్పుడు ఫేజ్-III (ఇంటర్వ్యూ రౌండ్)కి హాజరు కావాలి. ప్రధాన పరీక్ష జనవరి 2, 2022న నిర్వహించారు. మరిన్ని వివరాలు ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేకంగా SMS/ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక సైట్‌ను సందర్శించవచ్చు
మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అర్హులు. ఇంటర్వ్యూ ఫిబ్రవరి 2022 రెండో లేదా మూడో వారంలో నిర్వహిస్తారు. దానికి సంబంధించిన కాల్ లెటర్ ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో జారీ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. తుది ఫలితం ఫిబ్రవరి లేదా మార్చి 2022లో వెలువడే అవకాశం ఉంది. అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించండి. హోమ్‌పేజీలో ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కింద “మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్”పై క్లిక్ చేయండి. ఫలితం తెరపై కనిపిస్తుంది. ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.
SBI రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 2056 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ 20, 21, 27 తేదీల్లో జరిగింది. ఈ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించారు. SBI ప్రీ-ఎగ్జామ్ ఫలితాలు డిసెంబర్ 15న ప్రకటించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్‌లలో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం SBI PO 2021 పరీక్షకు దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.