Fenugreek Seeds: మెంతులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి..?

Fenugreek Seeds: మెంతులలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి పచ్చళ్లు, కూరల రుచిని పెంచుతాయి. ఇవి భారతీయ వంటగదిలో సులభంగా లభించే పదార్థాలు.

Fenugreek Seeds: మెంతులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి..?
Benefits Of fenugreek seeds
Follow us
uppula Raju

|

Updated on: Jan 27, 2022 | 7:14 AM

Fenugreek Seeds: మెంతులలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి పచ్చళ్లు, కూరల రుచిని పెంచుతాయి. ఇవి భారతీయ వంటగదిలో సులభంగా లభించే పదార్థాలు. మార్కెట్‌లో కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్, హై బ్లడ్ ప్రెజర్, యూరిక్ యాసిడ్ లెవల్స్, జుట్టు రాలడం మొదలైనవాటిని నియంత్రిస్తాయి. రక్తహీనత నుంచి కూడా కాపాడుతాయి. మెంతులు ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు A, C, K, B, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ఫైబర్ కలిగి ఉంటాయి. మెంతులు వంటకాలకు రుచిని అందించడమే కాకుండా మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మెంతులు చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

మెంతుల ఆరోగ్య ప్రయోజనాలు

మెంతులు ఆకలి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇది జుట్టు రాలడం, గ్రే హెయిర్, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త స్థాయిలను మెరుగుపరుస్తుంది. న్యూరల్జియా, పక్షవాతం, మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి వంటి వాత రుగ్మతల చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది. దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్, ఊబకాయం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మెంతులు సహజంగా వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ముక్కు నుంచి రక్తస్రావం వంటి రుగ్మతలకు ఉపయోగించకూడదు. ఎందుకంటే సమస్య అధికమవుతుంది.

1 నుంచి 2 టేబుల్ స్పూన్ల విత్తనాలను రాత్రంతా నానబెట్టి ఉదయం విత్తనాలను తినండి లేదా టీగా చేసుకొని తాగితే మంచిది. 1 టీస్పూన్ మెంతి పొడిని రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు లేదా రాత్రి వెచ్చని పాలు, నీటితో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. మెంతి గింజలను పేస్టులా చేసి పెరుగు/కలబంద జెల్/నీళ్లలో కలిపి తలకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలడం, తెల్లజుట్టు తగ్గుతాయి. రోజ్ వాటర్‌తో తయారుచేసిన మెంతి పేస్ట్ నల్లటి వలయాలు, మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Pickles: చలికాలం పచ్చళ్లు ఎక్కువగా తింటున్నారా.. కొంచెం ఈ విషయాలపై ఓ లుక్కేయండి..?

Viral Photos: కోహినూర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?

ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు.. ఆరోగ్యానికి హానికరం..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే