AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain Leaves: చలికాలంలో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి.. అనేక రకాల వ్యాధులకు చెక్

Ajwain Leaves Water:చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో సీజనల్ వ్యాధులు(Seasonal Diseases) నేను ఉన్నాయంటు తలపు తడతాయి, ముఖ్యంగా చలికాలం (Winter Season)లో వచ్చే జలుబు, దగ్గు(Cough and Cold) వంటి వ్యాధుల..

Ajwain Leaves:  చలికాలంలో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి.. అనేక రకాల వ్యాధులకు చెక్
Ajwain Leaves Water For Kids
Surya Kala
|

Updated on: Jan 27, 2022 | 8:39 AM

Share

Ajwain Leaves Water:చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో సీజనల్ వ్యాధులు(Seasonal Diseases) నేను ఉన్నాయంటు తలపు తడతాయి, ముఖ్యంగా చలికాలం(Winter Season)లో వచ్చే జలుబు, దగ్గు(Cough and Cold) వంటి వ్యాధుల బారిన చిన్నారులు ఈజీగా పడతారు. అయితే ప్రతి చిన్న రోగానికి ఇంగ్లీష్ మేడిసిన్స్ ను ఆశ్రయించే కంటే.. సహజమైన చిట్కాలు బెటర్ ని మన పెద్దలు చెబుతుంటారు. అవును చిన్నారులకే కాదు పెద్దలకు కూడా వచ్చే ఎన్నో వ్యాధుల నివారణకు చక్కటి దివ్య ఔషధం వామాకు. దీనినే కర్పూరవల్లి అని కూడా అని అంటారు. భారతీయుల వంటింట్లో ఉండే పోపుల పెట్టే ఓ ఆయుర్వేద ఔషధాల గని. పోపుల పెట్టెలో ఉండే అనేక మసాలా పదార్ధాలు రెగ్యులర్ వ్యాధుల నుంచి నివారణ ఇస్తాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సినవి వాము గింజలు. అదే విధంగా ప్రతి ఇంటి పెరడులో కచ్చితంగా ఉండాల్సిన మొక్కలలో ఒకటి వామాకు. వామాకు కొంచెం ఘాటు వాసనతో ఉండి ఉంటుంది. దీనిని డ్రింక్స్ తయారీకి, ఆహార పదార్ధాలలో కూడా ఉపయోగిస్తారు. వాములో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు, పోషకాలు అనేకం ఉన్నాయి. ఈ ఆకులను ఏదోక రూపంలో రెండు, మూడు నెలలకు ఒక్కసారి వాడితే కడుపు మొత్తం శుభ్ర పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ రోజు వామకు లో ఉండే ఔషధ గుణాలు, విశిష్ట వైద్య లక్షణాలు, అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

వాము ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు: *చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం వాము ఆకు సొంతం. వాము ఆకు రసంలో కొంచెం తేనె కలిపి ఇస్తే పిలల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. *చలికాలంలో పిలల్లో వచ్చే జలుబు, దగ్గు, వంటి వాటిని వాము ని వేడి నీటిలో మరిగించి ఇస్తే మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. *అజీర్తి, కడుపునొప్పి, వికారం, వాంతులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు వాము ఆకు మంచి ఔషధం. *పురుగులు, కీటకాలు కుట్టి చర్మం మీద దద్దుర్లను వాము ఆకు రసం నివారిస్తుంది. *ఈ ఆకుల రసం కాలిన గాయాలు, మచ్చలను తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలు, మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. *వామాకు తలనొప్పి తగ్గిస్తుంది. వాము ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. *ఈ ఆకులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన శరీరంలో అన్ని రకాల నొప్పులను నయం చేస్తుంది. *తిన్న ఆహారం జీర్ణమవకుండా కడుపునొప్పితో బాధపడుతుంటే వాము ఆకు నమిలితే ఉపశమనం కలుగుతుంది. పిల్లలు, పెద్దలు ఎవరికైనా కడుపు నొప్పి తగ్గుతుంది.

గమనిక: ఈ సహజ మైన చిట్కాలను పెద్దలు నమ్మకం.. సహజ చిట్కాలు ఆధారంగా ఇవ్వబడింది. కొన్ని చిట్కాలు శరీర తత్వాన్ని బట్టి ఏదైనా సరే డాక్టర్ సలహాలను అనుసరించి పాటించాల్సి ఉంటుంది.