Dead Person Fingerprint: ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు మరణించిన వ్యక్తి ఫింగర్‌ ప్రింట్‌ ఎందుకు పని చేయవు.. వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..?

Dead Person Fingerprint: మనిషి వేలిముద్రల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ వేలిముద్రలు మామూలు సమయాల్లోనే కాకుండా..

Dead Person Fingerprint: ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు మరణించిన వ్యక్తి ఫింగర్‌ ప్రింట్‌ ఎందుకు పని చేయవు.. వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..?
Follow us

|

Updated on: Jan 26, 2022 | 6:27 AM

Dead Person Fingerprint: మనిషి వేలిముద్రల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ వేలిముద్రలు మామూలు సమయాల్లోనే కాకుండా ముఖ్యమైన సమయాల్లో కూడా ఉపయోగపడతాయి. సంతకం చేయలేని వారికి ఈ వేలిముద్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు.. ఏదైనా ఇన్వెస్టిగేషన్‌లో ఈ వేలిముద్రల ద్వారా వివరాలు రాబట్టవచ్చు. వేలిముద్రలను ఆధార్‌, పాన్‌ కార్డులలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు కూడా ఈ వేలిముద్రలు ఎంతో అవసరం. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వేలిముద్రలను ఉపయోగించవచ్చా..? వేలిముద్రలతో ఉన్న ఫోన్‌లాక్‌ను ఆ చనిపోయిన వ్యక్తితో అన్‌లాక్‌ చేయవచ్చా..? బతికి ఉన్నప్పుడు ఉన్న వేలిముద్రలు.. చనిపోయిన తర్వాత ఎందుకు మరిపోతాయి..? ఇటువంటి ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతుంటాయి.

మరణించిన వ్యక్తి రంగు మారుతుంది

ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని శరీరం రంగు మారుతుంది. ఇక చనిపోయి ఎక్కువ రోజులైతే కనుక శరీరమంతా కుళ్లిపోతుంది. అలాంటి సమయంలో కూడా నిపుణులు వేలిముద్రలను గుర్తించగలుగుతారు. బతికి ఉన్నప్పుడు ఉన్న వేలిముద్రలు చనిపోయిన తర్వాత ఉండవు. ఎందుకంటే శరీరంతో పాటు వేలిముద్రలు కూడా మరిపోతాయి. కానీ ఇన్వెస్ట్‌గేషన్‌లో భాగంగా బతికి ఉన్న సమయంలో ఉన్న వేలిముద్రలను, చనిపోయిన తర్వాత కూడా గుర్తించగలుగుతారు నిపుణులు. వీటిని ఫోరెన్సిక్‌ నిపుణులు ల్యాబ్‌లలో గుర్తించగలుగుతారు.

సాంకేతికపరంగా సులభంగా గుర్తించవచ్చు..

జీవించి ఉన్న, చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను గుర్తించేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదంటున్నారు ఫోరెన్సిక్‌ నిపుణులు. ఎందుకంటే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో సాంకేతికపరంగా సులభంగా గుర్తించగలుగుతారు. మీరు ఫోన్‌ అన్‌లాక్‌ చేయాలంటే చనిపోయిన వ్యక్తి వేలిముద్రలతో చేయలేరు. ఒక వేళ ఓ వ్యక్తి ఏదైనా ప్రమాదం కారణంగా అతను చనిపోయాడా..? బతికి ఉన్నాడా..? అనే విషయాన్ని మొబైల్‌ అన్‌లాక్‌ ద్వారా కూడా అంచనా వేయవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే అతని వేలిముద్రలు పూర్తిగా మారిపోతాయి. అలాంటి సమయంలో ఫోన్‌ అన్‌లాక్‌ వేలిముద్రలు మ్యాచ్‌ కావు. వాస్తవానికి మొబైల్‌ ఫోన్‌ సెన్సార్‌ కూడా ఒక వ్యక్తి వేళ్లలో నడిచే విద్యుత్‌ ప్రసరణ ఆధారంగా పని చేస్తుంది. వ్యక్తి మరణించిన తర్వాత అతని శరీరంలో ఉన్న విద్యుత్‌ ప్రసరణ నిలిచిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మొబైల్‌ సెన్సార్లు విద్యుత్‌ ప్రసరణ లేకుండా వేళ్లను గుర్తించలేవు. అందుకే వ్యక్తి బతికున్నప్పుడు.. చనిపోయినప్పుడు వేలిముద్రల్లో తేడాలు ఉంటాయి.

ఇవి  కూడా చదవండి:

Human Body: మానవ శరీర నిర్మాణంలో కొన్ని ముఖ్యాంశాలు.. ఆసక్తికర విషయాలు..!

SIM Cards: మీ ఆధార్‌తో ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా..!

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.