AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flying Cars: వావ్.. ఎగిరిపోవచ్చు… గాలిలో తేలే కార్లు వచ్చేస్తున్నాయోచ్..

ట్రాపిక్‌లో చిక్కుకున్నప్పుడు చాలా మందికి ఓ ఐడియా వస్తుంటుంది. మా కారుకు రెక్కలుంటే ఎంత బాగుండో అని ఫీల్ అవుతుంటారు. వారి కోరిక దేవుడు విన్నట్లున్నాడు. వెంటనే ఓకే చేశాడు..

Flying Cars: వావ్.. ఎగిరిపోవచ్చు... గాలిలో తేలే కార్లు వచ్చేస్తున్నాయోచ్..
Flying Cars
Sanjay Kasula
|

Updated on: Jan 26, 2022 | 9:59 PM

Share

ట్రాపిక్‌లో చిక్కుకున్నప్పుడు చాలా మందికి ఓ ఐడియా వస్తుంటుంది. మా కారుకు రెక్కలుంటే ఎంత బాగుండో అని ఫీల్ అవుతుంటారు. వారి కోరిక దేవుడు విన్నట్లున్నాడు. వెంటనే ఓకే చేశాడు. ఇక ఎగిరిపోయేందుకు రెడీ ఉండటమే తర్వాయి. స్లోవాక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ద్వారా ఎయిర్‌కార్, డ్యూయల్-మోడ్ కార్-ఎయిర్‌క్రాఫ్ట్ అధికారిక ఆమోదం లభించింది. సమీప భవిష్యత్తులో ఈ కారును లండన్ నుండి పారిస్‌కు ఎగురవేయాలని కంపెనీ యోచిస్తోంది. గంటకు 160కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు వాయుయోగ్యత సర్టిఫికేట్‌ను స్లోవాక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(Slovak Transport Authority) జారీ చేసింది. సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ అనుమతి లభించడంతో ఎగిరే కార్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.

ఈ హైబ్రిడ్ కార్-ఎయిర్‌క్రాఫ్ట్, AirCar, BMW ఇంజిన్‌తో అమర్చబడి సాధారణ పెట్రోల్‌తో నడిచేలా తయారుచేయబడింది. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు రెండు నిమిషాల 15 సెకన్లు అవసరం అవుతుంది. 70గంటల పరీక్షలు, 200 టేకాఫ్‌లు, ల్యాండింగ్‌ల తర్వాత ఈ ఎయిర్‌కార్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఎయిర్‌కార్‌ను స్లోవేకియన్ కంపెనీ క్లీన్ విజన్ అభివృద్ధి చేసింది. ఇది 2017 నుండి అభివృద్ధిలో ఉంది మరియు చివరకు భారీ ఉత్పత్తికి ఒక అడుగు దగ్గరగా ఉంది, ఎగిరే కార్ల గురించి మన కలలను వాస్తవికతకు దగ్గరగా చేస్తుంది.

“ఎయిర్‌కార్ సర్టిఫికేషన్ చాలా సమర్థవంతమైన ఎగిరే కార్ల భారీ ఉత్పత్తికి తలుపులు తెరుస్తుంది. మధ్య-దూర ప్రయాణాన్ని శాశ్వతంగా మార్చగల మా సామర్థ్యానికి ఇది అధికారిక, తుది నిర్ధారణ” అని క్లీన్ విజన్  ఆవిష్కర్త , వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ స్టెఫాన్ క్లైన్ అన్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..