AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioPhone 5G: రిలయన్స్‌ జియో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. వివరాలు లీక్‌..!

JioPhone 5G: భారత దేశంలో రిలయన్స్‌ జియో (Reliance Jio) దూసుకుపోతోంది. నెట్‌వర్క్‌ విషయంలో ముందడుగు వేస్తోంది. ఈ ఏడాదిలో..

JioPhone 5G: రిలయన్స్‌ జియో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. వివరాలు లీక్‌..!
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 27, 2022 | 7:06 AM

Share

JioPhone 5G: భారత దేశంలో రిలయన్స్‌ జియో (Reliance Jio) దూసుకుపోతోంది. నెట్‌వర్క్‌ విషయంలో ముందడుగు వేస్తోంది. ఈ ఏడాదిలో 5జీ నెట్‌వర్క్‌ (5G Network)దూసుకుపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రముఖ టెలికం కంపెనీలు ఈ ఏడాదిలో 5జీ సేవలు (5G Service) ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నాయి. కస్టమర్లకు వేగమైన 5జీ (5G) సేవలు అందించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రిలయన్స్‌ జియో (Reliance Jio) 5జీలో ఓ అడుగు ముందుకేసింది. 5జీ నెట్‌వర్క్ ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది జియో. ఈ నేపథ్యంలో 5జీ మొబైల్‌ను కూడా తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫిచర్స్‌ వివరాలు లీకయ్యాయి.

జియోఫోన్ 5జీ లీకైన స్పెసిఫికేషన్స్‌:

రిలయన్స్‌ జియో (Reliance Jio) దేశంలో 5జీ సేవలు మొదటి దశలో 13 నగరాల్లో ప్రారంభించనున్నట్లు ఆండ్రాయిడ్‌ (Android) సెంట్రల్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా జియోఫోన్‌ 5జీ (JioPhone 5G) స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకు తీసుకురానుంది. దీని ధర రూ.10,000లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. అలాగే 4జీబీ ర్యామ్‌ (4GB Ram), 32 ఇంటర్నల్‌ స్టోరేజీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో ఉండనున్నట్లు సమాచారం. ఇందులో ఆండ్రాయిడ్‌ 11 (Android 11) ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఉండనుంది. ఈ ఫోన్‌లో ప్రధాన కెమెరా 13ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, బ్యాటరీ 5000ఎంఏహెచ్‌, 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టుతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఎప్పుడు మార్కెట్లు విడుదల అవుతుందనే విషయం క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి:

SIM Cards: మీ ఆధార్‌తో ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా..!

iPhone 13: ఐఫోన్‌ 13లో కొత్త సమస్య.. పింక్‌ కలర్‌గా మారుతున్న స్క్రీన్‌..!