WhatsApp: వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు.. ఐఓఎస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా..
WhatsApp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఇక ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో..
WhatsApp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఇక ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యాప్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తోన్న వాట్సాప్ తాజాగా ఐఓఎస్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్లలో వాయిస్ మెసేజ్ పాజ్ అండ్ రెస్యూమ్ మొదటిది. ఈ ఫీచర్ ఇప్పటికే డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండగా తాజాగా ఐఓఎస్ యూజర్లకు అందించారు. ఈ సరికొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేస్తున్నప్పుడు పాజ్, రెజ్యుమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండో ఫీచర్‌లో భాగంగా న్యూ ఫోకస్ మోడ్‌ను తీసుకొచ్చారు. సాధారణంగా వాట్సాప్‌లో రోజూ ఎన్నో మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని అలాగే వదిలేస్తుంటాం. అయితే ముఖ్యమైన వ్యక్తులు, గ్రూప్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను మనకు తెలిపేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది.
దీంతో మనకు నచ్చిన వారి నుంచి వచ్చిన మెసేజ్‌లను మాత్రమే నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ బార్‌లో కనిపించే మెసేజ్‌లన్నీ ముఖ్యమైనవనే విషయాన్ని యూజర్ గుర్తించగలడు. ప్రస్తుతం కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
Also Read: Pickles: చలికాలం పచ్చళ్లు ఎక్కువగా తింటున్నారా.. కొంచెం ఈ విషయాలపై ఓ లుక్కేయండి..?
Textile: చీరలపై ఐ లవ్ యూ అని ముద్రణ.. వస్త్ర వ్యాపారులపై ప్రజల ఆగ్రహం! చివరికి ఏమైందంటే..