Xiaomi Redmi Note 11 సిరీస్‌లో 4 కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు తెలుసుకోండి..?

Xiaomi Redmi Note 11: గ్లోబల్ మార్కెట్‌లో Xiaomi తన Redmi Note 11 సిరీస్ కింద నాలుగు కొత్త మొబైల్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఫోన్లు

Xiaomi Redmi Note 11 సిరీస్‌లో 4 కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు తెలుసుకోండి..?
Redmi Note 11 Series
Follow us
uppula Raju

|

Updated on: Jan 27, 2022 | 9:54 AM

Xiaomi Redmi Note 11: గ్లోబల్ మార్కెట్‌లో Xiaomi తన Redmi Note 11 సిరీస్ కింద నాలుగు కొత్త మొబైల్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఫోన్లు Redmi Note 11 Pro, Redmi Note 11 Pro 5G , Redmi Note 11S , Redmi Note 11 స్మార్ట్‌ఫోన్‌లు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు AMOLED డిస్‌ప్లే, 120hz డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, 108 మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తున్నాయి. ఫిబ్రవరి 9 న భారతదేశంలో రెడ్‌మి నోట్ 11ఎస్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది.

Redmi Note 11 Pro 5G 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఇది పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. Redmi Note 11 Pro Gలో Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ఉపయోగించారు. అలాగే ఇది 8 GB ర్యామ్‌ని కలిగి ఉంది. ఇందులో 1 TB వరకు స్టోరేజ్‌ చేసుకోవచ్చు.

Redmi Note 11 Proలో MediaTek Helio G96 చిప్‌సెట్ ఇచ్చారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5000 mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇది 67 W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. Redmi Note 11S, Redmi Note 11 సరసమైన సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లు అని Xiaomi ఇప్పటికే ప్రకటించింది.

Redmi Note 11 మొబైల్ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 33W ఫాస్ట్ ఛార్జర్, 50MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ఇది 3.5mm ఆడియో జాక్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz పంచ్ హోల్‌తో నాక్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ఇచ్చారు. 1 TB వరకు SD కార్డ్‌ను ఇందులో ఇన్‌స్టాల్ చేయవచ్చు.

Redmi Note 11Sలో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే ఇది 90hz AMOLED డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. MediaTek Helio G96 చిప్‌సెట్ ఇందులో అమర్చారు.

ధరలు..

Xiaomi Redmi Note 11 Pro 5G ధర 6GB RAM, 64GB స్టోరేజ్‌ $329 (సుమారు రూ. 24,636). అదే సమయంలో Redmi Note 11 Pro 5G ధర 299 US డాలర్లు (దాదాపు రూ. 22,389). ఇందులో 6 జీబీ ర్యామ్ ఉంటుంది. Redmi Note 11 Pro ధర 299 US డాలర్లు (సుమారు రూ. 22, 389), ఇందులో 6 GB RAM అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో Redmi 11 Pro నాన్ 5G ధర US $ 279 (సుమారు రూ. 20, 892).

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. UAN పాస్‌వర్డ్ మర్చిపోయారా.. ఇలా చేయండి..?

చాణక్య నీతి: జీవితంలో ఈ 3 పనులు ఆలస్యం చేయవద్దు.. లేదంటే మరణించే సమయంలో పశ్చాత్తాపం..?

నిరుద్యోగులకు గమనిక.. ఆర్మీTGT, PGT పోస్టులకు రేపే చివరి తేదీ..?