AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. UAN పాస్‌వర్డ్ మర్చిపోయారా.. ఇలా చేయండి..?

EPFO: జీవితంలో కొన్ని విషయాలు మరిచిపోవడం అందరికి సహజంగా జరుగుతుంటుంది. ఎందుకంటే ప్రతి దానికి పాస్‌వర్డ్‌ ఉన్నందున కొన్నింటిని మరిచిపోతుంటారు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. UAN పాస్‌వర్డ్ మర్చిపోయారా.. ఇలా చేయండి..?
Epfo1
uppula Raju
|

Updated on: Jan 27, 2022 | 9:40 AM

Share

EPFO: జీవితంలో కొన్ని విషయాలు మరిచిపోవడం అందరికి సహజంగా జరుగుతుంటుంది. ఎందుకంటే ప్రతి దానికి పాస్‌వర్డ్‌ ఉన్నందున కొన్నింటిని మరిచిపోతుంటారు. మొబైల్ ఆపరేట్ చేయడం నుంచి ల్యాప్‌టాప్-కంప్యూటర్ తెరవడం అన్ని పాస్‌వర్డ్‌లని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అన్నిటికి ఒకే పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే హ్యాకర్లు మీ పర్సనల్‌ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. అందుకే చాలామంది ప్రతిదానికి వేర్వేరు పాస్‌వర్డ్‌లని మెయింటెన్ చేస్తారు. అయితే అన్నిసార్లు ఇలాంటి పాస్‌వర్డ్‌లని గుర్తుంచుకోవడం కష్టమే.

అలాగే చాలాసార్లు ఈపీఎఫ్‌వోకి సంబంధించిన UAN నెంబర్‌, పాస్‌వర్డ్‌ మరిచిపోతుంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం. UAN అనేది మీ EPF ఖాతాతో మీరు పొందే యూనివర్సల్ ఖాతా సంఖ్య. UAN పాస్‌వర్డ్ తెలిస్తేనే మీరు PF ఖాతాను ఓపెన్‌ చేయగలరు. ఒకవేళ దీని పాస్‌వర్డ్‌ మరిచిపోతే మీరు EPFO ​​వెబ్‌సైట్‌కి లాగిన్ అయి కొత్త పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలి లేదా పాత పాస్‌వర్డ్‌ను మార్చాలి. కొన్ని కారణాల వల్ల మీరు పాస్‌వర్డ్‌ను మరిచిపోతే అప్పుడు దానిని రీసెట్ చేయాలి. అది ఎలాగో తెలుసుకుందాం.

ఇలా చేయండి..

1. UAN అధికారిక పోర్టల్ EPFO UAN లాగిన్ పోర్టల్‌కి వెళ్లండి

2. Forgot Password లింక్‌పై క్లిక్ చేయండి

3. తదుపరి స్క్రీన్‌లో మీరు UAN నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి.

4. వివరాలను నమోదు చేసిన తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి

5. మీ UANకి లింక్ చేసిన మొబైల్ నంబర్ కనిపిస్తుంది. మీరు మొబైల్ నంబర్‌ని మార్చాలనుకుంటే నంబర్‌పై బటన్ క్లిక్ చేయండి

6. ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, KYC రకం, డాక్యుమెంట్ నంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.

7. మీ వివరాలను విజయవంతంగా నమోదు చేసిన తర్వాత డాక్యుమెంట్ నంబర్ పక్కన ఉన్న వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి.

8. వివరాలు సరిపోలితే మీరు మీ కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేయవచ్చు

9. మీ కొత్త మొబైల్ నంబర్ కోసం OTPని అందుకుంటారు

10. మీ నచ్చిన పాస్‌వర్డ్‌ను రెండుసార్లు నమోదు చేయండి.

11. చివరగా మీ పాస్‌వర్డ్ విజయవంతంగా మార్చబడిందని చెప్పే మెస్సేజ్‌ వస్తుంది.

చాణక్య నీతి: జీవితంలో ఈ 3 పనులు ఆలస్యం చేయవద్దు.. లేదంటే మరణించే సమయంలో పశ్చాత్తాపం..?

నిరుద్యోగులకు గమనిక.. ఆర్మీTGT, PGT పోస్టులకు రేపే చివరి తేదీ..?

నేడు టాటా చెంతకు చేరనున్న ఎయిర్ ఇండియా.. ఇప్పుడు సరికొత్త ప్లాన్‌తో ఆకాశంలోకి..