Petrol Diesel Price: స్వల్పంగా తగ్గిన ముడి చమురు ధరలు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Petrol-Diesel Rates Today: అంతర్జాతీయ మార్కెట్(Global Market) లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అయినా దేశీయ మార్కెట్ లో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరల్లో ఎటువంటి మార్పులు సంభవించడం లేదు.
Petrol-Diesel Rates Today: అంతర్జాతీయ మార్కెట్(Global Market) లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అయినా దేశీయ మార్కెట్ లో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరల్లో ఎటువంటి మార్పులు సంభవించడం లేదు. మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పెట్రోల్ ,డీజిల్ ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. కాగా గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఏ మాత్రం ఉండడం లేదు. సుమారు మూడు నెలలకు పైగా పైగా దేశంలో ఇంధన ధరలు నిలకడగా ఉంటున్నాయి. మరి ఈరోజు (జనవరి27) మెట్రో నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.52గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.83ఉండగా.. డీజిల్ ధర రూ.94. 28గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.91పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.34గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.85కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.90 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.36లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.13గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.23గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.85లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.90లకు లభిస్తోంది.
మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.51 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.91.53గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 కు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.
Also read: US- Canada border: ‘డాలర్ డ్రీమ్స్’ లో ఆ గ్రామ ప్రజలు.. అదే ప్రాణాల మీదకు తెస్తోంది..
Mouni Roy: పెళ్లికూతురైన నాగినీ బ్యూటీ.. ట్రెండింగ్ లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు..