Mouni Roy: పెళ్లికూతురైన నాగినీ బ్యూటీ.. ట్రెండింగ్ లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు..

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ (Vicky- Katrina), రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ (Rajkumar- Patralekha),  ఆదిత్య సీల్-అనుష్క రంజన్, అంకితా లోఖండే- విక్కీ(Ankitha Lokhnade- Vicky) .. ఇలా గతేడాది బాలీవుడ్‌లో ఎంతోమంది పెళ్లిపీటలెక్కారు.

Mouni Roy: పెళ్లికూతురైన నాగినీ బ్యూటీ.. ట్రెండింగ్ లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు..
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2022 | 7:04 AM

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ (Vicky- Katrina), రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ (Rajkumar- Patralekha),  ఆదిత్య సీల్-అనుష్క రంజన్, అంకితా లోఖండే- విక్కీ(Ankitha Lokhnade- Vicky) .. ఇలా గతేడాది బాలీవుడ్‌లో ఎంతోమంది పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు వీరిని అనుసరిస్తూ మరికొంత మంది 2022లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో ‘నాగిని’ సీరియల్‌తో బోలెడంత క్రేజ్‌ తెచ్చుకున్న మౌనీ రాయ్‌(Mouni Roy) ఈ ఏడాది మొదట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది . వ్యాపారవేత్త  సూరజ్ నంబియార్‌తో  నేడు  (జనవరి 27)న గోవాలో పెళ్లిపీటలెక్కనుంది. ఈక్రమంలో వీరిద్దరి ప్రి – వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇక్కడ కూడా ‘పుష్ప’ మేనియానే..

కాగా కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగనుంది.  కాగా ముందస్తు పెళ్లి వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారీ కాబోయే వధూవరులు. ఈ సందర్భంగా పసుపు కలర్ లెహెంగాలో మౌనీరాయ్ ఎంతో అందంగా ముస్తాబవగా, తెలుపు రంగు దుస్తుల్లో తళుక్కుమన్నాడు సూరజ్. వేడుకల్లో భాగంగా  పుష్ప సినిమాలోని శ్రీవల్లీ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారీ లవ్ బర్డ్స్. కాగా వీరి హల్దీ, మెహందీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను మౌనీరాయ్ స్నేహితులు నటి మందిరా బేడీ, రాహుల్, ప్రతీక్ శెట్టి సోషల్ మీడియాలో పంచుకోగా అవి కాస్తా వైరలయ్యాయి.

‘రన్’ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మౌనీరాయ్ ‘గోల్డ్’, ‘కేజీఎఫ్’, ‘లండన్ కాన్పిడెన్షియల్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకంది. అటు నాగినీ సీరియల్స్ తో బుల్లితెరపై కూడా సత్తాచాటింది. ప్రస్తుతం ఆమె ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో కూడా నటిస్తోంది.  కాగా గత కొద్దికాలంగా బిజినెస్ మెన్ సూరజ్ తో ఆమె ప్రేమలో ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యారు. గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో వీరి వివాహం జరగనుంది. పలువరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వెడ్డింగ్ కు హాజరుకానున్నారని సమాచారం.

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi)

Also Read: Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

SIDBI Recruitment: సిడ్బీలో స్పెషలిస్ట్ పోస్టులు. ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక‌.. రేపే చివ‌రి తేదీ..

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధర.. మళ్లీ పరుగులు.. 10 గ్రాముల ధర ఎంతంటే!