Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) మేనియా ఇప్పట్లో తగ్గెలా కనిపించడం లేదు. సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..
Follow us

|

Updated on: Jan 27, 2022 | 6:22 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) మేనియా ఇప్పట్లో తగ్గెలా కనిపించడం లేదు. సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డు వ్యూస్ సాధిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పాటలు, డైలాగులు, డ్యాన్సులకు  అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే ‘పుష్ప’ సినిమా విడుదలైనప్పటి నుంచి దేశ, విదేశాలకు చెందిన సామాన్యుల దగ్గరి నుంచి సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, స్టార్‌ క్రికెటర్లు ఈ సినిమాలోని పాటలు, డైలాగులను ఇమిటేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, డ్వేన్ బ్రావో పుష్పను అనుకరించగా తాజాగా  టీమిండియా హార్దిక్ పాండ్యా ఈ జాబితాలో చేరాడు.

తగ్గేదేలే..

ఈ సందర్భంగా  శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును తన నాన్నమ్మతో కలిసి వేశాడీ స్టార్ క్రికెటర్. చివర్లో  ఇద్దరూ కలిసి ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ స్టైల్ ను అనుకరించారు. అనంతరం ‘ మా పుష్ప నానమ్మ’ అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు హార్దిక్. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కామెంట్లతో నింపేస్తున్నారు. ముఖ్యంగా వయసు సహకరించకపోయినా కళ్లకు గ్లాసెస్ పెట్టుకుని మనవడితో కలిసి స్టెప్పులేసిన బామ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘క్యూటెస్ట్ వీడియో’, ‘ఇది వేరే లెవెల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 20.37 లక్షల మంది చూడడం విశేషం. మరి మీరు కూడా ఈ క్యూట్ వీడియోపై ఓ లుక్కేయండి.

Also read:IND vs WI: విండీస్‌ను ఢీకొనే టీమిండియా ఇదే.. సారథిగా రోహిత్.. తిరిగొచ్చిన చైనామన్ బౌలర్.. అశ్విన్‌కు నో ఛాన్స్

Silver Price Today: బంగారం బాటలో వెండి.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ ధర..!

Vastu Tips: ఇంట్లో ఇవి ఉంటే ఆర్థిక సమస్యలే.. వెంటనే తీసేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?