AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ (Nenu Shailaja) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్ (Keerthy Suresh).

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2022 | 9:58 PM

Share

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ (Nenu Shailaja) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్ (Keerthy Suresh). అందం.. అభినయంతో వరుస ఆఫర్లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి (Mahanati) సినిమాలో అలనాటి హీరోయిన్ సావిత్రి పాత్రను పోషించింది కీర్తి. ఇందులో కీర్తి నటనకు సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మహానటి సావిత్రి రూపాన్ని మైమరపించింది కీర్తి సురేష్. ఈ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయంది. మహానటి మూవీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అలాగే కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి సినిమా ఈనెల 28న థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానెల్‏ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈరోజు నా అధికారిక యూట్యూబ్ ఛానల్‏ను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సబ్ స్కైబ్ చేసి వీడియోలు చూడండి అంటూ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది కీర్తి సురేష్. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

Also Read: Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారో ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మతిపోగొట్టింది..

Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..

Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..

Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..