Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి (Shilpa Shetty) గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన భర్త రాజ్ కుంద్రా

Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..
Shilpa Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2022 | 2:54 PM

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి (Shilpa Shetty) గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను చిత్రీకరించారంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిల్పా కూడా నిందింతురాలు అంటూ పోలీసులు తెలిపారు. ఇక ఇటీవలే శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే తాజాగా శిల్పా శెట్టికి బహిరంగ ముద్దు కేసు నుంచి ఊరట లభించింది. పదిహేనేళ్ల క్రితం బహిరంగ ముద్దు వివాదంలో శిల్పా నిందితురాలిగా కేసు నమోదైంది. ఈ వివాదం పై విచారణ జరిపిన కోర్టు.. ఆమె బాధితురాలని పేర్కోంది.

వివరాల్లోకెళితే.. 2007లో రాజస్తాన్‏లో జరిగిన ఓ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే వేదికపై ఉన్న రిచర్డ్ గేర్.. శిల్పా శెట్టిని చూడగానే ఆమెకు అట్రాక్ట్ అయ్యి.. ఆమె చేతులను పట్టుకుని ముద్దులు పెట్టాడు. దీన్ని శిల్పా శెట్టి అడ్డుకోలేకపోయింది. అయితే ఈ విషయంపై ఆ సమయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. రిచర్డ్ గేర్ తనతో అల అనుచితంగ ప్రవర్తించినప్పుడు శిల్పా శెట్టి అడ్డుకోలేదంటూ ఆమెపై వ్యతిరేక ఆరోపణలు వచ్చాయి. దీంతో బహిరంగంగానే వీరిద్దరి ముద్దులు పెట్టుకున్నారంటూ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. అయితే ముందుగా ఈ కేసును రాజస్థాన్ కోర్టులో విచారించగా.. ఆ తర్వాత శిల్పా శెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రో పాలిటన్ కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. తాజాగా ఈ కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం..శిల్పా శెట్టి బాధితురాలని తెలిపింది. అలాగే హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రధాన నిందితుడిగా పేర్కోంది.

Also Read: Tamannaah Bhatia: ఎట్రాక్ట్ చేస్తున్న మోడరన్ డ్రస్ లో ‘తమన్నా’ మెరుపులపై మీరు ఓ లుక్కేయండి..

Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..

Republic Day 2022: వినూత్నంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన బిగ్ బీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

Nani’s Dasara: నేచురల్ స్టార్ సినిమా కోసం భారీ విలేజ్ సెట్.. ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు..