Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..

ప్రముఖ నటుడు సంపత్ రాజ్(Sampath Raj) .. ప్రభాస్ నటించిన మిర్చి (Mirchi) సినిమాలో విలన్ పాత్రలో ఫేమస్

Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..
Sampath Raj
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2022 | 3:13 PM

ప్రముఖ నటుడు సంపత్ రాజ్(Sampath Raj) .. ప్రభాస్ నటించిన మిర్చి (Mirchi) సినిమాలో విలన్ పాత్రలో ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత సంపత్ రాజ్ ఎన్నో చిత్రాల్లో విలన్‏గా.. నాన్నగా.. అన్నగా… ఇలా ఒక్కటేమిటీ ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. శ్రీమంతుడు, రన రాజా రన్, కృష్ణ గాడి వీర ప్రేమా గాధ వంటి చిత్రాలు సంపత్ రాజ్‏కు గుర్తింపునిచ్చాయి. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించారు సంపత్ రాజ్. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

సంపత్ రాజ్ మాట్లాడుతూ..ఓ డైరెక్టర్ తన తదుపరి సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే కెమెరాలు ఎత్తుకెళ్లిపోతానని సరదగా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఇక సంపత్ రాజ్ మాటలు చూస్తే ఆ డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఎస్పీ చరణ్‏తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎదురైన సంఘటనలు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ ఆర్టిస్ట్ శరణ్య తన మొదటి భార్య అంటూ వచ్చిన వార్తలపై సంపత్ రాజ్ స్పందించారు. శరణ్య, తను కేవలం స్నేహితులము మాత్రమే అని చెప్పుకొచ్చారు. శరణ్య కుటుంబం తనకు చాలా క్లోజ్ అని.. ఆమె భర్త కూడా తన స్నేహితుడని.. కానీ మా ఇద్దరిపై వచ్చిన రూమర్స్ పై ఎలా స్పందించాలో అర్థం కాలేదని తెలిపారు. ఓ సినిమాలో నేను, శరణ్య భార్యభర్తలుగా నటించామని..దీంతో ఎవరో ఆ ఫోటో పెట్టి ఎక్స్ వైఫ్ అంటూ రాసేశాడని.. దీంతో నాకు శరణ్యకు పెళ్లి అయ్యిందని రూమర్స్ వచ్చాయంటూ చెప్పుకొచ్చారు సంపత్ రాజ్.

Also Read: Tamannaah Bhatia: ఎట్రాక్ట్ చేస్తున్న మోడరన్ డ్రస్ లో ‘తమన్నా’ మెరుపులపై మీరు ఓ లుక్కేయండి..

Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..

Republic Day 2022: వినూత్నంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన బిగ్ బీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

Nani’s Dasara: నేచురల్ స్టార్ సినిమా కోసం భారీ విలేజ్ సెట్.. ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు..