Janhvi Kapoor: టీమిండియా ఆటగాళ్ల దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకుంటోన్న శ్రీదేవి కూతురు.. ఎందుకోసమంటే..

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor).  మొదటి సినిమా ‘ధడక్(Dhadak) ’తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Janhvi Kapoor: టీమిండియా ఆటగాళ్ల దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకుంటోన్న శ్రీదేవి కూతురు.. ఎందుకోసమంటే..
Janhvi Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2022 | 7:35 AM

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor).  మొదటి సినిమా ‘ధడక్(Dhadak) ’తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ తో తనలోని నటిని పరిచయం చేసింది.  సినిమాల్లో తన తల్లి లేని లోటును తీర్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోన్న ఈ అందాల తార.. అందుకు తగ్గట్లుగానే వైవిధ్యమైన సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం జాన్వీ నటించిన  ‘గుడ్ లక్ జెర్రీ’,  ‘మిలి’  తుది దశకు చేరుకున్నాయి . మరో సినిమా ‘ దోస్తానా 2’ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.   కాగా ఈ అందాల తార నటిస్తోన్న మరో  చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’.

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీతో పాటు రాజ్ కుమార్ రావ్ నటిస్తున్నారు. ఇద్దరూ క్రికెటర్లు గానే కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసమే  ప్రత్యేకంగా  టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకుంటోంది జాన్వీ. బ్యాటింగ్ లో మెలకువలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా తన క్రికెట్ ట్రైనింగ్ కు సంబంధించిన ఫొటోలను ‘క్రికెట్ క్యాంప్ అట్ మిస్టర్ అండ్  మిసెస్ మహీ’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార. ఓ ఫొటోలో హెల్మెట్ పెట్టుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. మరో ఫొటోలో  దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.  మరో పిక్ లో దాంట్లో చిత్రబృందంలో కలిసి సరదాగా ముచ్చటిస్తోంది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా శరన్ శర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Mouni Roy: పెళ్లికూతురైన నాగినీ బ్యూటీ.. ట్రెండింగ్ లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు..

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Diabetes: వృద్ధులు ప్రతి రోజు ఆ పని చేస్తే టైప్‌-2 డయాబెటిస్‌ అదుపులో.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు