Diabetes: వృద్ధులు ప్రతి రోజు ఆ పని చేస్తే టైప్‌-2 డయాబెటిస్‌ అదుపులో.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

Diabetes: కాలం మారుతున్నకొద్ది కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా మానవునికి వ్యాధులు చుట్టుముడుతున్నాయి...

Diabetes: వృద్ధులు ప్రతి రోజు ఆ పని చేస్తే టైప్‌-2 డయాబెటిస్‌ అదుపులో.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jan 27, 2022 | 7:06 AM

Diabetes: కాలం మారుతున్నకొద్ది కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా మానవునికి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక దేశంలో డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. వృద్దుల్లో మధుమేహం ఎలా ఉంటుంది..? దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే కోణంతో కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 70 నుంచి 80 ఏళ్ల వయసు కలిగిన వృద్ధులు నిత్యం నడవడం ద్వారా టైప్‌-2 డయాబెటిస్‌ సమస్యను తగ్గించుకోవచ్చని అధ్యయనం ద్వారా తేల్చారు. ఈ అధ్య‌య‌నానికి సంబంధించిన వివరాలు డ‌యాబెటిస్ కేర్ జ‌న‌ర‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

65 ఏండ్లు దాటిన వృద్ధుల‌పై ప‌రిశోధ‌న‌..

ఒక వృద్ధుడు లేదా వృద్ధురాలు త‌ను రోజూ న‌డిచేదానికంటే ఒక వెయ్యి అడుగులు ఎక్కువ న‌డిస్తే మధుమేహం రిస్క్‌ 6 శాతం తగ్గుతుందని నిపుణులు తెలిపారు. అందువ‌ల్ల రోజుకు 2000 అడుగులు అద‌నంగా న‌డ‌వగ‌లిగితే టైప్‌-2 డ‌యాబెటిస్ రిస్క్‌ 12 శాతం త‌గ్గుతుంద‌ని తేల్చారు. అయితే మ‌ధుమేహం లేని 65 ఏండ్ల పైబ‌డిన వృద్ధుల‌ను ఈ ప‌రిశోధ‌న కోసం ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు. వారి కుడి తుంటిపై యాక్సిల‌రోమీట‌ర్‌లను అమర్చి పరిశీలించారు. వారంరోజుల‌పాటు రోజూ 24 గంట‌ల‌చొప్పున వాటిని తీయ‌కుండా ఉంచుకోవాల‌ని వారికి సూచించారు పరిశోధకులు. ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రతి రోజు ఎక్కువ నడిచిన వారిలో టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడే వారి సంఖ్య తగ్గింది. చాలా తక్కువ నడక నడిచిన వారు డయాబెటిస్‌ బారిన పడ్డారు. వృద్దుల్లో డయాబెటిస్‌కు, నడకకు సంబంధం ఉందని స్పష్టం చేశారు. ఈ అధ్యయనం మొత్తం 4,838 మందిపై జరుగగా, వారిలో 395 మంది అంటే 8 శాతం మంది డ‌యాబెటిస్ బారిన‌ప‌డ్డారు.

ప్రతి యేటా మధుమేహం బారిన 15 లక్షల మంది:

అమెరిక‌న్ డయాబెటిస్ అసోసియేష‌న్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి సంవత్సరం కొత్త‌గా 15 ల‌క్ష‌ల మంది డయాబెటిస్‌ బారిన‌ప‌డుతున్నారు. అందులో దాదాపు 5 లక్ష‌ల మంది 70 ఏండ్లు దాటిన వృద్ధులే ఉంటున్నారు. అందుకే వృద్ధులంతా రోజుకు క‌నీసం 2000 అడుగుల చొప్పున న‌డిస్తే వారిలో మ‌ధుమేహం రిస్క్ 12 శాతం త‌గ్గుతుంద‌ని తాజా అధ్య‌య‌నం చేసిన‌ ప‌రిశోధ‌కులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Onion, Garlic: వంటింట్లో ఉండే ఉల్లి, వెల్లుల్లికి మొలకలు ఎందుకు వస్తాయి.. తింటే మంచిదేనా..?

Cumin Benefits: మధుమేహం ఉన్నవారికి జీలకర్రతో అద్భుతమైన ఉపయోగాలు.. ఇదే కాకుండా..

Kidney Stones: మీకు కిడ్నిల్లో రాళ్ల ఏర్పడ్డాయా..? వాటిని కరిగించాలంటే వీటిని పాటించడండి..!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్