Kidney Stones: మీకు కిడ్నిల్లో రాళ్ల ఏర్పడ్డాయా..? వాటిని కరిగించాలంటే వీటిని పాటించడండి..!
Kidney Stones: కొన్ని అనారోగ్య సమస్యలను మనం గుర్తించేలోపే అవి తీవ్రమై ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంటుంది. మూత్రపిండాల్లో,..
Kidney Stones: కొన్ని అనారోగ్య సమస్యలను మనం గుర్తించేలోపే అవి తీవ్రమై ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంటుంది. మూత్రపిండాల్లో, పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళు ఇలాంటివే. కిడ్నీ స్టోన్స్ కన్నా గాల్ స్టోన్స్ వల్ల ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది.. అవి హఠాత్తుగా అత్యవసర పరిస్థితికి దారి తీస్తాయి. సమస్య మరింత ముదరక ముందే అప్రమత్తం కావాలి.
కాలేయం దిగువన పియర్ పండు ఆకారంలో ఉండే పిత్తాశయం జీర్ణక్రియకు తోడ్పడుతూ ఉంటుంది. కాలేయంలో తయారయ్యే జీర్ణరసం, బైల్ డక్ట్ ద్వారా పిత్తాశయం గుండా చిన్న పేగుల్లోకి చేరుకుంటూ ఉంటుంది. పేగులు ఈ బైల్‌ను కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాయి. కాలేయం నుంచి స్రవించే బైల్‌ను పిత్తాశయం తనలో నిల్వ చేసుకుంటూ, దాన్లోని నీటిని వడగట్టి జీర్ణప్రక్రియ కోసం పేగుల్లోకి పంపిస్తూ ఉంటుంది. ఇలా పిత్తాశయం జీర్ణప్రక్రియలో ఓ రిజర్వాయర్‌లా, కన్వేయర్ వ్యవస్థలా పని చేస్తూ ఉంటుంది. ఏళ్ల తరబడి జరిగే ఈ ప్రక్రియ ఫలితంగా పిత్తాశయంలో లేదా బైల్ డక్ట్‌లో గాల్ స్టోన్స్ ఏర్పడతాయి. అయితే ఇవి నిజానికి రాళ్లు కావు. బైల్ రసాలే దీర్ఘకాలంలో రాళ్లుగా గట్టిపడతాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బైల్‌స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి పరిమాణం బియ్యం గింజ మొదలు గోల్ఫ్ బంతి వరకూ ఉండవచ్చు. ఇవి కాలేయం నుంచి పేగుల్లోకి స్రవించే బైల్‌కు అవరోధంగా మారతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ రాళ్లు పిత్తాశయం పనితీరును దెబ్బతీయడమే కాకుండా, సమయానికి సమస్యను సరిదిద్దకపోతే శరీర జీవక్రియల మీద పరోక్ష ప్రభావం చూపిస్తాయి.
లక్షణాలు..
► కడుపు నొప్పి, మరీ ముఖ్యంగా పొట్టపై భాగంలో, వీపులో నొప్పి గంటల తరబడి వేధిస్తుంది
► చర్మం పసుపు రంగులోకి మారుతుంది
► జ్వరం.. వాంతులు
► అజీర్తి, పొట్ట ఉబ్బరం, అసిడిటీ, ఛాతీలో మంట మొదలైన జీర్ణ సంబంధ సమస్యలు
కారణాలు ఎన్నో..
► గాల్‌స్టోన్స్‌లో రెండు రకాలుంటాయి. సాధారణంగా 80 మందిలో కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇవి పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. రెండో రకం పిగ్మెంట్ గాల్ స్టోన్స్ ముదురు రంగులో చిన్నవిగా ఉంటాయి. బైల్ స్రావాల్లోని బైల్‌రుబిన్ కారణంగా ఇవి ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే 25 నుంచి 45 ఏళ్ల వయస్కుల్లో ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది. అలాగే ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా కొనసాగుతుంది.
► అధిక బరువు వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా పిత్తాశయం పూర్తి స్థాయిలో ఖాళీ కాకపోవడం మూలంగా రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి బైల్ స్టోన్స్‌కు ఓ కారణం అధిక బరువుగా చెప్పుకోవచ్చు.
► పోషకాహార లోపం కూడా ఉంటుంది. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోగా, అధిక మొత్తంలో కొవ్వుతో కూడిన పదార్థాలు తినడం వల్ల కూడా బైల్ స్టోన్స్ ఏర్పడే వీలుంటుంది.
► డయాబెటిస్ ఉన్నవారిలో అధిక మొత్తంలో ట్రైగ్లిజరైడ్స్ (ఒక రకమైన శరీర కొవ్వు) ఉంటాయి. ఇవి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడానికి దోహదం చేస్తాయి.
► గర్భిణుల్లో, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలలో, మెనోపాజ్ లక్షణాలను తగ్గించుకోవడం కోసం హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకునేవారిలో, శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది. ఫలితంగా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతాయి.
► కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు బైల్ రసంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా బైల్ స్టోన్స్ ఏర్పడతాయి. ఉపవాసాలు చేసే వారిలో పిత్తాశయం సరిపడా కుంచించుకుపోదు. ఫలితంగా దానిలో రాళ్లు ఏర్పడే వీలు పెరుగుతుంది.
► వేగంగా శరీర బరువు కోల్పోయే వారిలో కూడా గాల్ స్టోన్స్ ఏర్పడే వీలుంటుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు, అధిక బరువును క్రమపద్ధతిలో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పిత్తాశయ రాళ్ల తయారీకి కారణమయ్యే ఆరోగ్య సమస్యల మీద ఓ కన్నేసి ఉంచడం మంచిది.
► పోషకాహార లోపం. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోగా, అధిక మొత్తంలో కొవ్వుతో కూడిన పదార్థాలు తినడం వల్ల కూడా బైల్ స్టోన్స్ ఏర్పడే వీలుంటుంది.
మూత్రపిండాల్లో రాళ్లకు వైద్యులు సూచించిన చికిత్సలతో పాటు తేలికపాటి చిట్కాలు
నిమ్మరసం: నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌లను కలిపి తాగాలి. వెంటనే నీళ్లు కూడా తాగాలి. ఈ చిట్కాను రోజులో రెండు నుంచి మూడు సార్లు, వరుసగా మూడు రోజుల పాటు పాటించాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ఒకటి నుంచి రెండు వారాల పాటు రోజుకు ఒక గ్లాసు చొప్పున 100 శాతం పూర్తి నిమ్మరసం తాగాలి.
దానిమ్మ: ఉదయాన్నే పరగడుపున దానిమ్మ రసం తాగాలి. దానిమ్మ రసాన్ని ఉలవలతో తయారుచేసిన సూప్‌తో కలిపి మధ్యాహ్నం వేళ తాగాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి.
క్రాన్‌బెర్రీ: రోజుకు మూడు గ్లాసుల చొప్పున క్రాన్‌బెర్రీ రసం తాగాలి. ఇలా వారం నుంచి రెండు వారాల పాటు చేయాలి.
బ్లాక్ కరెంట్: ఈ పళ్లను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా తినాలి.
నీళ్లు: రోజుకు 8 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
అవి అపోహలే..
పిత్తాశయాన్ని తొలగించడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయనీ, బరువు పెరుగుతారనీ, పిల్లలు పుట్టరనీ అపోహలు ఉన్నాయి. నిజానికి పిత్తాశయం తొలగించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిరూపించే ఆధారాలు ఎక్కడా లేవని వైద్య నిపుణులు అంటున్నారు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించడం జరుగుతుంది. ఈ అంశాలు కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మేలు.)
ఇవి కూడా చదవండి: