నేడు టాటా చెంతకు చేరనున్న ఎయిర్ ఇండియా.. ఇప్పుడు సరికొత్త ప్లాన్‌తో ఆకాశంలోకి..

నేడు టాటా చెంతకు చేరనున్న ఎయిర్ ఇండియా.. ఇప్పుడు సరికొత్త ప్లాన్‌తో ఆకాశంలోకి..
Tata Takeover Air India

Air India:ఎయిర్ ఇండియా స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ రోజు (జనవరి 27న) అంటే గురువారం టాటా గ్రూపునకు అప్పగిస్తారు. ఈ డీల్‌కు సంబంధించిన మిగిలిన

uppula Raju

|

Jan 27, 2022 | 8:13 AM

Air India:ఎయిర్ ఇండియా స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ రోజు (జనవరి 27న) అంటే గురువారం టాటా గ్రూపునకు అప్పగిస్తారు. ఈ డీల్‌కు సంబంధించిన మిగిలిన ఫార్మాలిటీలు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయి. ఎయిర్ ఇండియా ఉద్యోగులకు పంపిన సందేశంలో ఎయిర్ ఇండియా ఫైనాన్స్ డైరెక్టర్ వినోద్ హెజ్మాడి జనవరి 24 న కంపెనీ బ్యాలెన్స్ షీట్ మూసివేస్తున్నాం తద్వారా టాటా గ్రూప్ దానిని సమీక్షించవచ్చని తెలిపారు. గతేడాది అక్టోబరు 8న ఎయిరిండియా బిడ్‌ను టాటా గ్రూప్ గెలుచుకుంది. ఎయిర్ ఇండియా-టాటా గ్రూప్‌ల ఈ డీల్ రూ.18,000 కోట్లకు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆర్మ్ AISATS అమ్మకాలతో సహా 2003-04 తర్వాత ఇదే తొలి ప్రైవేటీకరణ. ఎయిర్ ఇండియా దేశీయ విమానాశ్రయాలలో 4,480, అంతర్జాతీయంగా 2,738 ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లను నిర్వహిస్తోంది. అలాగే కంపెనీకి విదేశీ విమానాశ్రయాలలో పార్కింగ్ కోసం దాదాపు 900 స్లాట్‌లు ఉన్నాయి. ఈ స్లాట్‌లు కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌ను చేరుకోవడం, విమానాల గురించి తెలియజేస్తాయి. అయితే ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతి వారం 665 విమానాలను నడుపుతోంది.

ఇప్పుడు కొత్త ప్లాన్

ఒప్పందం ప్రకారం టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లలో 100 శాతం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ AISATS లో 50 శాతం వాటాను పొందుతోంది. టాటా ఎయిర్ ఇండియా ఈ డీల్‌కు బదులుగా ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నగదును ఇస్తుంది. ఎయిర్‌లైన్స్‌పై ఉన్న రూ.15,300 కోట్ల రుణాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా అనే మూడు విమానయాన సంస్థలను నిర్వహిస్తుందని చెబుతున్నారు. గ్రూప్ ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లను విలీనం చేసే అవకాశం ఉంది. దీంతో దేశ విమానయాన పరిశ్రమలో టాటా గ్రూపు తన ఆధిపత్యాన్ని నెలకొల్పే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.

గత సంవత్సరం ఓవర్సీస్‌లో దుమ్ముదులిపేసింది.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం ఇదే..?

Pickles: చలికాలం పచ్చళ్లు ఎక్కువగా తింటున్నారా.. కొంచెం ఈ విషయాలపై ఓ లుక్కేయండి..?

Viral Photos: కోహినూర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu