గత సంవత్సరం ఓవర్సీస్‌లో దుమ్ముదులిపేసింది.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం ఇదే..?

Bollywood News: కబీర్ ఖాన్ గతంలో చాలా గొప్ప చిత్రాలను నిర్మించాడు అవి బాక్సాఫీస్ వద్ద చాలా విజయవంతమయ్యాయి. అయితే రీసెంట్ గా

గత సంవత్సరం ఓవర్సీస్‌లో దుమ్ముదులిపేసింది.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం ఇదే..?
Film 83
Follow us
uppula Raju

|

Updated on: Jan 27, 2022 | 7:42 AM

Bollywood News: కబీర్ ఖాన్ గతంలో చాలా గొప్ప చిత్రాలను నిర్మించాడు అవి బాక్సాఫీస్ వద్ద చాలా విజయవంతమయ్యాయి. అయితే రీసెంట్ గా ఆయన చేసిన ’83’ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో విభిన్నమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కెమిస్ట్రీ అందరికి నచ్చింది. వీరిద్దరు కాకుండా సినిమాలోని ఇతర నటీనటులందరూ చాలా బాగా నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విభిన్నమైన ముద్ర వేసింది. మొదటి ప్రపంచకప్ నేపథ్యంగా తీసిన ఈ సినిమా చాలా ప్రశంసలందుకుంది.

’83’ ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది

కబీర్ ఖాన్ ’83’ ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె నటించిన ఈ స్ఫూర్తిదాయకమైన స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 24, 2021న విడుదలై ఒక నెలను పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో తన పట్టును కొనసాగిస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాత దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ 2021లో 31 రోజుల్లో రూ. 62.54 కోట్లు రాబట్టి, 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది.

నైట్ కర్ఫ్యూ, 50 శాతం సీట్ల ఆక్యుపెన్సీ, ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాలలో సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లను మూసివేయడం వంటి భారీ అడ్డంకులు ఉన్నప్పటికీ ’83’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే నంబర్‌లను సంపాదించగలిగింది. చిత్ర బృందం చెప్పినట్లుగా ’83’ భారతీయ సినిమా నుంచి గొప్ప చిత్రం మాత్రమే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల హృదయాలలో నివసించే భావోద్వేగం.

ఎన్నో ఆంక్షలున్నప్పటికీ అంచనాలను అందుకుంది

కబీర్ ఖాన్ మాట్లాడుతూ “ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి లభించిన ప్రేమ, ప్రశంసలు నిజంగా హృదయపూర్వకంగా ఉన్నాయి. కోవిడ్-19 పరిమితులు లేనిదగ్గర, థియేటర్లు పూర్తి సీటింగ్ కెపాసిటీతో నడుస్తున్న దగ్గర, ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ’83’ భారతీయ సినిమా అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటిగా భావిస్తున్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను.” అని తెలిపాడు.

Fenugreek Seeds: మెంతులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి..?

Pickles: చలికాలం పచ్చళ్లు ఎక్కువగా తింటున్నారా.. కొంచెం ఈ విషయాలపై ఓ లుక్కేయండి..?

Viral Photos: కోహినూర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?