AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana Viral Pic: పెళ్లి కూతురు లుక్ లో కుర్రకారు మతులు పోగొడుతున్న ఇలియానా.. ఫోటోలు వైరల్..

Ileana Viral Pics: ఇలియానా (Ileana)టాలీవుడ్ (Tollywood)నుంచి బాలీవుడ్(Bollywood) లో అడుగు పెట్టి.. అక్కడ కూడా తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు హిందీ చిత్ర పరిశ్రమలో..

Ileana Viral Pic: పెళ్లి కూతురు లుక్ లో కుర్రకారు మతులు పోగొడుతున్న ఇలియానా.. ఫోటోలు వైరల్..
Ileana
Surya Kala
|

Updated on: Jan 27, 2022 | 9:46 AM

Share

Ileana Viral Pic: ఇలియానా (Ileana)టాలీవుడ్ (Tollywood)నుంచి బాలీవుడ్(Bollywood) లో అడుగు పెట్టి.. అక్కడ కూడా తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆకర్షణీయమైన, ఫ్యాషన్ హీరోయిన్స్ లో ఇలియానా నిలిచింది. ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫోటోషూట్‌లు , విహారయాత్రలకు సంబందించిన అద్భుతమైన చిత్రాలను షేర్ చేస్తూ.. తన అభిమానులను ట్రీట్ చేస్తూనే ఉంది. తాజాగా ఇల్లి బేబీ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఇలియానా ఎరుపు రంగు లెహంగాను ధరించి పెళ్లి కూతురు లుక్ లో ఓ బైక్‌పై కూర్చుంది. అసలే అందమైన ఇలియానాకు ఈ ఎరుపు రంగు లెహంగామరింత అందాన్ని ఇచ్చింది. అంతేకాదు.. ప్రకాశవంతంగా ఉదయిస్తున్న సూర్యుడిలా వెలిగిపొతూ ఉంది. ఈ ఫోటోలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలియానా ధరించిన నల్లని పాయింటెడ్ హీల్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలియానా అభిమానులు. సోషల్ మీడియా ఫాలోవర్స్.. ఇలియానా పెళ్లి కూతురు లుక్ కి ఫిదా అయ్యారు. హార్ట్ సింబల్స్, ముద్దుల ఎమోజీలతో నింపేశారు.

ఇలియానా 2022లో రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. రణదీప్ హుడా సరసన ఇలియానా నటించిన ఫెయిర్ స్కిన్ సినిమా రిలీజ్ కానుంది. ఇది ‘ఫెయిర్ అండ్ లవ్లీ’పై భారతదేశం అబ్సెషన్ ఆధారంగా తెరకెక్కిన సామాజిక సృహతో పూర్తి కామెడీ సినిమా. అంతేకాదు ఇంకా పేరు పెట్టని రొమాంటిక్ కామెడీ-డ్రామా చిత్రంలొనూ నటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ , భారతీయ-అమెరికన్ సంచలనం సెంధిల్ రామమూర్తితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఇలియనా నటించిన ‘ది బిగ్ బుల్’ 2021 OTT విడుదలైంది. ఈ సినిమాలో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధరంగా తెరకెక్కింది. 1992 నాటి భారతీయ స్టాక్ మార్కెట్ స్కామ్‌ను పరిశోధించిన ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ ఆధారంగా వార్తలు నివేదించిన మీరా రావు పాత్రను పోషించింది.

Also Read:   రహదారిపై మంచుని శుభ్రం చేస్తోన్న ఒంటి కొమ్ము గుర్రం.. నెట్టింట్లో వీడియో వైరల్..