Pink Unicorn: రహదారిపై మంచుని శుభ్రం చేస్తోన్న ఒంటి కొమ్ము గుర్రం.. నెట్టింట్లో వీడియో వైరల్..

Pink Unicorn: కొంతమంది తాను చేసే పనిలో సంతోషాన్ని వెదుకుకుంటారు. మరి కొందరి తాను చేసే పనిని ఇష్టపడడమే కాదు.. తన సంతోషంతో పాటు.. ఇతరులను కూడా సంతోష పెడతాడు..

Pink Unicorn: రహదారిపై మంచుని శుభ్రం చేస్తోన్న ఒంటి కొమ్ము గుర్రం.. నెట్టింట్లో వీడియో వైరల్..
Pink Unicorn
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2022 | 9:12 AM

Pink Unicorn: కొంతమంది తాను చేసే పనిలో సంతోషాన్ని వెదుకుకుంటారు. మరి కొందరి తాను చేసే పనిని ఇష్టపడడమే కాదు.. తన సంతోషంతో పాటు.. ఇతరులను కూడా సంతోష పెడతాడు. తాజాగా ఓ వ్యక్తీ రోడ్డు మీద కురుస్తున్న మంచు(Snow) ని క్లియర్ చేస్తున్నాడు. అయితే అతను మంచు క్లియర్ చేస్తున్న సమయంలో పింక్ కలర్ ఒంటి కొమ్ము గుర్రం(Pink Unicorn Costume) దుస్తులను ధరించాడు. ఈ అందమైన వీడియో ఇంటర్నెట్‌లో అత్యంత అందమైన వైరల్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ట్విటర్‌లో Buitengebieden పోస్ట్ చేశారు. ఇప్పటికే 73k కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఈ సుందరమైన చిన్న వీడియోలో అమెరికాలోని లేక్‌వుడ్, క్లీవ్‌ల్యాండ్‌లోని రహదారులపై మంచు భారీగా కప్పబడింది. ఆ మంచును తొలగించడానికి ఒక వ్యక్తి ప్రకాశవంతమైన గులాబీ రంగు ఒంటి కొమ్ము గల గుర్రం ( యూనికార్న్ )దుస్తులు ధరించి కనిపించాడు. ఆ వ్యక్తి రహదారిపై కప్పబడిన మంచును తొలగించాడు. అతని దుస్తులు చుట్టుపక్కల వారి దృష్టిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారు అతను పని చేస్తున్న సమయంలో ప్రకృతిని ఇష్టపడుతూ.. పరిసరాలను ఎంజాయ్ చేస్తున్న విధానం పలువురుని ఆకట్టుకుంది.

ఈ వీడియో ట్విట్టర్ యూజర్ సుజీ లీ పోస్ట్ చేశారు. “లేక్‌వుడ్‌లో ఎవరైనా మంచు కురుస్తున్న సమయంలో ఇలా యునికార్న్ దుస్తులు ధరిస్తారు. నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే సన్నివేశం అంటూ వీడియోకి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియో పలురువు నెటిజన్లను ఆకర్షిస్తోంది. చాలా అందమైన సన్నివేశం. అతని వేషం నాకు చాలా నచ్చింది. అందమైన వ్యక్తి.. అతను మంచుని తొలగించడం నేను ఇష్టపడుతున్నా అంటూ రకరకాల కామెంట్స్ తో ఆ వ్యక్తిని పొగడ్తల వర్షంతో తడిపేస్తున్నారు.

Also Read:  ప్రకృతి ప్రేమికుల కోసం రైల్వే సంస్థ అతి తక్కువ ధరతో గౌహతి టూర్.. ప్యాకేజీ పూర్తి వివరాలు మీ కోసం..