IRCTC Tour Package: ప్రకృతి ప్రేమికుల కోసం రైల్వే సంస్థ అతి తక్కువ ధరతో గౌహతి టూర్.. ప్యాకేజీ పూర్తి వివరాలు మీ కోసం..

IRCTC Tour Package: పచ్చని ప్రకృతి ప్రేమికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈశాన్య భారత దేశం టూర్ (North East India Tour)ప్యాకేజీని అందిస్తోంది. వాస్తవానికి, చాలా మంది..

IRCTC Tour Package: ప్రకృతి ప్రేమికుల కోసం రైల్వే సంస్థ అతి తక్కువ ధరతో గౌహతి టూర్.. ప్యాకేజీ పూర్తి వివరాలు మీ కోసం..
Ex Guwahati
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2022 | 8:54 AM

IRCTC Tour Package: పచ్చని ప్రకృతి ప్రేమికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈశాన్య భారత దేశం టూర్ (North East India Tour)ప్యాకేజీని అందిస్తోంది. వాస్తవానికి, చాలా మంది సెలవుల్లో మాత్రమే ప్రయాణించాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే టూరిజం తాజాగా షెడ్యూల్ ను ప్రకటించింది. ఇది ఐఆర్‌సీటీసీ భారత్‌ దర్శన్‌లో భాగంగా మార్చి నెలలో నిర్వహిస్తున్న టూర్‌ ప్యాకేజ్‌. ఈ పర్యటన ఏడు రోజుల పాటు సాగనుంది. అంటే ఆరు రాత్రులు, ఏడు పగళ్ళు ఉంటుంది. ఇక ఈ టూర్ మార్చి 14 వ తేదీన మొదలై 20వ తేదీతో పూర్తవుతుంది. ఇందులో చిరపుంజి, కాజీరంగా, మావ్లిన్‌నాంగ్, షిల్లాంగ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ముఖ్యంగా ఈ గౌహతి టూర్ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేయనుంది.

ప్యాకేజీ వివరాలు: 

ప్యాకేజీ పేరు: ఈశాన్య భారత దేశం టూర్.. ఎక్స్-గౌహతి ప్యాకేజీ

దర్శించనున్న పర్యాటక స్థలాలు : చిరపుంజి, కాజీరంగా, మావ్లిన్‌నాంగ్, షిల్లాంగ్, గౌహతి,

ప్రయాణం చేసే విధానం: AC టూరిస్ట్ వాహనం/ తదితర వాహనాలు

టూర్ ప్యాకేజీ డేస్ : 06 రాత్రులు , 07 పగళ్ళు మొత్తం ఏడురోజులు

టూర్ తేదీ ప్రారంభదేవి :14 మార్చి 2022

భోజనం సదుపాయాలు: అల్పాహారం , రాత్రి భోజనం

ప్యాకేజీ టికెట్ ధర:

ఒక్కో వ్యక్తి సింగిల్ బెర్త్ కు : రూ.37,760/-

ఇద్దరు వ్యక్తులకు : రూ.24,910/-

ముగ్గురు వ్యక్తులకు : 23,760/-

5 నుంచి 11 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఒకొక్కరికి రూ.21,460/-

Note: ఈ టూర్ కనీస పర్యాటకులు టికెట్స్ ను బుక్ చేసుకున్న తర్వాతనే ప్రారభం అవుతుంది. కరోనా నేపధ్యంలో అన్ని నిబంధనలతో రైల్వే తగిన ఏర్పాట్లు చేస్తుంది.

Also Read:  చలికాలంలో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి.. అనేక రకాల వ్యాధులకు చెక్