చాణక్య నీతి: జీవితంలో ఈ 3 పనులు ఆలస్యం చేయవద్దు.. లేదంటే మరణించే సమయంలో పశ్చాత్తాపం..?

చాణక్య నీతి: జీవితంలో ఈ 3 పనులు ఆలస్యం చేయవద్దు.. లేదంటే మరణించే సమయంలో పశ్చాత్తాపం..?
Chanakya Niti

చాణక్య నీతి: జీవితంలో చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవి వెంటనే చేయడం అలవాటు చేసుకోవాలి.

uppula Raju

|

Jan 27, 2022 | 9:18 AM

చాణక్య నీతి: జీవితంలో చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవి వెంటనే చేయడం అలవాటు చేసుకోవాలి. లేదంటే చివరకి పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథంలో అలాంటి కొన్ని విషయాల గురించి ప్రస్తావించాడు. ఈ పనులను సంతోషంగా చేసే వ్యక్తి జీవితంలో ఆనందంగా ఉంటాడని, అతడు మరణించే సమయంలో కూడా తృప్తిగా మరణిస్తాడని చెప్పాడు. అలాంటి మూడు పనుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. పుట్టిన ప్రతి వ్యక్తి అన్ని విధులకు, బాధ్యతలకు కట్టుబడి ఉంటాడు. ఆచార్య చాణక్యుడు తన వ్యక్తిగత పనులను సమయానికి చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంటూనే కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించాలని నమ్మాడు. ఒక వ్యక్తిని వ్యాధి చుట్టుముట్టినప్పుడు అతను తన పనిని చేయలేకపోతాడు. అతడి మరణం కూడా అనుకోకుండా జరిగిపోతుంది. కాబట్టి కొన్ని పనుల కోసం వృద్ధాప్యం వరకు వేచి ఉండకండి. మీ విధులను, బాధ్యతలను సకాలంలో నెరవేర్చడం ద్వారా మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. దాని నుంచి మీరు పుణ్యాన్ని పొందుతారు. లేకపోతే మరణ సమయంలో మీ మనస్సులో అసంతృప్తి ఉంటుంది.

2. దానధర్మాలు ఒక వ్యక్తి పాప పుణ్యాలను నిర్ణయిస్తాయి. అతని జీవితాన్ని అందంగా మార్చే పనిని కూడా చేస్తాయి. గ్రంధాలలో దాన ధర్మం ప్రాముఖ్యతను వివరిస్తూ సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వానికి ఖర్చు చేయాలని చెప్పాడు. ధనవంతులు కావడానికి లేదా వృద్ధాప్యంలో దానధర్మాలు చేయడానికి వెయిట్‌ చేస్తూ ఉండకూడదు. జీవితంలో భాగమై ఎప్పటికప్పుడు తన సంపదను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు సహాయం చేసి పుణ్యం సంపాదించాలి.

3. ఇవి కాకుండా మీ మనస్సులో ఏదైనా ముఖ్యమైన పని చేయాలని మీరు అనుకుంటే దానిని రేపటికి వాయిదా వేయవద్దని ఆచార్య నమ్మారు. రేపటికి గ్యారెంటీ లేనందున వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కానీ చెడు ఆలోచన వస్తే దానిని నివారించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. తద్వారా మీరు దాని హాని నుంచి సురక్షితంగా ఉంటారు.

నిరుద్యోగులకు గమనిక.. ఆర్మీTGT, PGT పోస్టులకు రేపే చివరి తేదీ..?

నేడు టాటా చెంతకు చేరనున్న ఎయిర్ ఇండియా.. ఇప్పుడు సరికొత్త ప్లాన్‌తో ఆకాశంలోకి..

గత సంవత్సరం ఓవర్సీస్‌లో దుమ్ముదులిపేసింది.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం ఇదే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu