Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (27-01-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope 2022
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2022 | 6:36 AM

Horoscope Today (27-01-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 27 వ తేదీ ) గురువారం  రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు  చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. పనిలో ఒత్తిడి పెరిగి మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి.  స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. బంధు, మిత్రులతో విబేధాలు రాకుండా చూసుకోవాలి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు గతంలో చేపట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవల్సి  ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు  బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తి నిర్ణయంతో అందరి ప్రశంసలు పొందుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. పతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు  భాదను కలిగించే వార్తను వింటారు. మానసికంగా ఆందోళనను ఎదుర్కొంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు తడబాటు లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది. వృధా ఖర్చులు చేస్తారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యవిషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభ సమయం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలను అందుకుంటారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కీలకపనులు పూర్తి చేస్తారు.  పై అధికారుల నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

TTD Tickets: 28వ తేదీన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. పూర్తి వివరాలివే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే