- Telugu News Photo Gallery Spiritual photos Jyotish tips: These remedies of jaggery are helpful in protecting from the inauspicious effects of surya in horoscope
Astro Remedies: సూర్యుడు మీ జాతకంలో బలహీనంగా ఉన్నాడా..కెరీర్ , ఉద్యోగం కోసం బెల్లాన్ని ఇలా నివేదించండి..
Astro Remedies: సూర్యుడు గ్రహాలకు అధినాయకుడు. ఏ వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీన స్థితిలో ఉంటాడో అతని ఆరోగ్యం, గౌరవ మర్యాదలపై ప్రభావం చూపిస్తుంది. కెరీర్‌లో చాలా సమస్యలు ఏర్పడతాయి. బంధాలు బలహీన పడతాయి. కనుక సూర్యుడికి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు పొందవచ్చు. ఈరోజు సూర్యుడుకి బెల్లం నైవేద్యం బెల్లానికి సంబంధించిన కొన్ని జ్యోతిష్య పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
Updated on: Jan 27, 2022 | 2:06 PM

మీ కెరీర్ కష్టాల్లో ఉన్నా.. లేక మంచి ఉద్యోగం రావాలన్నా ఆవుకి గోధుమ రొట్టి బెల్లం కలిపి తినిపించండి. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు బెల్లం తిని నీళ్లు తాగి ఇంటి నుంచి బయలుదేరాలి. ఇలా చేస్తే సానుకూల ఫలితాలను పొందుతారు.

జాతకంలో సూర్యుని స్థానం బలహీన స్థితిలో ఉంటే.. బలపరచడానికి.. 800 గ్రాముల గోధుమలు, అదే పరిమాణంలో బెల్లం తీసుకొని ఆదివారం రోజున ఆలయంలో నైవేద్యంగా పెట్టండి. అంతేకాదు రొజూ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం అలవాటు చేసుకోండి.

జీవితంలో అన్నీ కష్టాలు ఎదురవుతున్నప్పుడు చాలా ఒత్తిడికి గురవుతున్నా.. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతున్నా ఆదివారం ఎరుపు గుడ్డలో రెండు కిలోల బెల్లం కట్టి, సురక్షితమైన స్థలంలో ఉంచండి. ఒత్తిడిని, నిద్ర లేమిని నివారిస్తుంది.

సూర్యుడు తండ్రికి సంకేతుడు. సూర్యుని అశుభ స్థానం కారణంగా తండ్రీ కొడుకుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లయితే, వరుసగా మూడు ఆదివారాలు బెల్లం పరిహారాన్ని చేయాలి. ఇందుకోసం వరుసగా మూడు ఆదివారాలు ప్రవహించే నీటిలో ఒకటిన్నర కిలోల బెల్లాన్ని నైవేద్యంగా విడిచి పెట్టండి.

వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి , కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ప్రతిరోజూ అక్షతలు, కొంచెం బెల్లం రాగి పాత్రలో వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇలా రోజూ కుదరకపోతే కనీసం ఆదివారం ఉదయం అయినా పొద్దున్నే లేచి ఇలా చేయండి. (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)





























