Budget 2022: జీఎస్టీ పరిధిలోకి సహజ వాయువు ఉత్పత్తులు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోన్న ఎఫ్‌ఐపీఐ..!

Union Budget 2022: ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించడానికి ముందు, అనేక పరిశ్రమల డిమాండ్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉన్నాయి. సహజ వాయువును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ ఉంది.

Budget 2022: జీఎస్టీ పరిధిలోకి సహజ వాయువు ఉత్పత్తులు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోన్న ఎఫ్‌ఐపీఐ..!
Natural Gas
Follow us
Venkata Chari

|

Updated on: Jan 27, 2022 | 9:59 AM

Industry Budget 2022: బడ్జెట్(Budget) సమర్పణకు ఇంకా ఐదు రోజులే మిగిలి ఉంది. పబ్లిక్ గ్యాస్ సెక్టార్ (PSU Gas Companies) కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల సంఘం రాబోయే బడ్జెట్‌లో సహజ వాయువు(Natural Gas) కోసం ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలను ఉంచింది. అందులో ముఖ్యంగా గ్యాస్‌ను వస్తువులు, సేవల పన్ను(GST) పరిధిలోకి తీసుకురావాలని కోరుకుంటోంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ- FIPI తన ప్రీ-బడ్జెట్ మెమోరాండమ్‌లో పైప్‌లైన్ ద్వారా సహజ వాయువు రవాణాపై GSTని హేతుబద్ధీకరించాలని, దిగుమతి చేసుకున్న LNGని గ్యాస్‌గా మార్చాలని డిమాండ్ చేసింది.

గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని నరేంద్ర మోడీ పర్యావరణ అనుకూల ఇంధన వాటాను పెంచడానికి సహజ వాయువును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని పరిశ్రమల సంఘం పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పరిశ్రమల సంస్థ సహజవాయువును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని గతంలో చాలాసార్లు డిమాండ్లు చేసింది.

“జీఎస్‌టీలో సహజ వాయువును చేర్చకపోవడం వల్ల సహజ వాయువు ధరలు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయి. గ్యాస్ ఉత్పత్తిదారులు/సరఫరాదారులు వివిధ రకాల పన్నులను ఎదుర్కోవాల్సి ఉంటుంది” ఉంటుందని ఎఫ్‌ఐపీఐ పేర్కొంటుంది. ముడి చమురు, సహజ వాయువు, పెట్రోల్, డీజిల్, ATF వంటి పెట్రోలియం ఉత్పత్తులను వీలైనంత త్వరగా GST పరిధిలోకి తీసుకురావాలని పరిశ్రమల సంఘం డిమాండ్ చేసింది. కాలుష్యకారక ద్రవ ఇంధనంతో ఎల్‌ఎన్‌జీని పోటీపడేలా చేసేందుకు దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాలని కోరింది.

2030 నాటికి సహజవాయువు వాటాను పెంచడమే లక్ష్యం.. 2030 నాటికి దేశంలో సహజవాయువు వాటాను 15 శాతానికి పెంచాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ప్రస్తుత వాటా 6.2 శాతంగా ఉంది. సహజ వాయువు వినియోగాన్ని పెంచడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గుతాయి. అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి.

Also Read: Budget2022: 51 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిన వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు.. రైతులకు పీఎం కిసాన్ మద్దతు!

Budget 2022: ప్రస్తుతం వ్యసాయరంగంలో ఎరువులపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు? ఉద్యానవన పంటలపై ప్రభుత్వ విధానం ఎలా ఉంది?