- Telugu News Photo Gallery You can lose weight easily with lemon peels, Check Here is Details in Telugu
Lemon Peel uses: నిమ్మతొక్కలతో కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఎలాగంటే!
నిమ్మ రసం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి. అలాగే నిమ్మ తొక్కలతో కూడా ఈజీగా వెయిల్ లాస్ అవ్వొచ్చు. ఇవి అధిక బరువు, ఊబకాయాన్ని తగ్గించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది..
Updated on: Dec 25, 2024 | 2:30 PM

నిమ్మకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. శరీరం ఆరోగ్యంగా పని చేయాలంటే విటమిన్ సి ఖచ్చితంగా అవసరం అవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇమ్యూనిటీ ఉంటే రోగాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. ఈ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ మాత్రమే కాకుండా చాలా ఆక్సలేట్ కూడా ఉంటుంది.

ఈ నిమ్మ తొక్కలో పెక్టిన్ అనే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచి ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది. అంతే కాకుండా శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

అందువల్ల ఈ నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఈ నీటిని తాగితే కిడ్నీ సంబంధిత సమస్య కూడా తీవ్రమవుతుంది.

దంత సమస్యలు ఉన్నవారికి లెమన్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. నిమ్మకాయలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దంతాల మీద ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా, దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి.





























