Budget 2022: బడ్జెట్‌పై ఐటీ రంగం భారీ ఆశలు.. ఆర్థిక మంత్రి ముందున్న భారీ సవాళ్లేంటంటే?
కొత్త కంపెనీల ద్వారా వచ్చే కొత్త పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభించేలా ఐటీ రంగంలోని స్టార్టప్‌లకు కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది.
IT Sector 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాల్గవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని మరోసారి కొనసాగించడమే కాకుండా, దేశంలోని అన్ని పరిశ్రమల అంచనాలను నెరవేరుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అందరి ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉండనుందనే ఊహాగానాల మధ్య ఐటీ రంగం కూడా భారీ ఆశలు పెట్టుకుంది. కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలను ఈ రంగం బడ్జెట్ నుంచి కోరుకుంటోంది. అవేంటో ఓసారి చూద్దాం..
ఐటీ రంగం అంచనాలు.. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఐటీ రంగం మంచి పనితీరు కనబరిచింది. ఈ రంగం కూడా బడ్జెట్ నుంచి ప్రయోజనం పొందుతుందని ఆశిస్తోంది. మహమ్మారి సమయంలో కూడా వ్యాపారాన్ని ఎలా సక్రమంగా నడపవచ్చో ఈ రంగం నిరూపించింది. అందుకోసం బడ్జెట్ నుంచి వస్తున్న ఐటీ రంగానికి సంబంధించిన కొన్ని డిమాండ్లపై చాలా ఫోకస్ పెట్టారు.
డిమాండ్లు ఇవే.. పన్ను మినహాయింపు రిస్క్ క్యాపిటల్ ఫ్రంట్‌లో ఐటి రంగానికి ఉపశమనం ఇస్తుందని ఆశపడుతోంది. వ్యాపార సౌలభ్యం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఐటీ కంపెనీల ఉద్యోగులు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నందున ఈ డబ్ల్యూఎఫ్‌హెచ్‌కు సంబంధించి కొత్త పాలసీని రూపొందించాలని, దీని ద్వారా అదనపు పన్ను భారం పడకుండా , ఉద్యోగులకు కొంత ఊరట కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
స్టార్టప్‌లపై కూడా.. ఐటీ రంగంలోని స్టార్టప్‌లకు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని, తద్వారా కొత్త కంపెనీల ద్వారా వచ్చే కొత్త పారిశ్రామికవేత్తలకు కూడా కొంత ప్రోత్సాహం లభించి ఐటీ రంగం వృద్ధితో పాటు ముందుకు సాగాలని డిమాండ్ ఉంది.
ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టనున్నారు.