Budget 2022: ఈ ఏడాది కూడా డిజిటిల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్ కూడా డిజిటల్ గానే ఉంటుంది.

Budget 2022: ఈ ఏడాది కూడా డిజిటిల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
Budget 2022
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 27, 2022 | 11:54 AM

Digital Budget 2022: కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్ కూడా డిజిటల్ గానే ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కారణంగా, ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక నివేదికల ప్రదర్శనకు సంబంధించిన అన్ని పత్రాలు ముద్రించడం జరుగుతుంది. అయితే, కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ రూపంలో మాత్రమే బడ్జెట్‌ను ముద్రించనున్నారు.ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థిక శాఖ అధికారుల సమాచారం ప్రకారం , కోవిడ్ మహమ్మారి కారణంగా బడ్జెట్ పత్రాలను ముద్రించడం ఈసారి కూడా జరగదు. బడ్జెట్ పత్రాలు ఎక్కువగా డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భౌతికంగా కొన్ని కాపీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

గతంలో బడ్జెట్ పత్రాలను ముద్రించేందుకు చాలా విస్తృతమైన ప్రక్రియ ఉండేది. సంఖ్యాపరంగా ఇది చాలా విస్తృతమైన ప్రక్రియ, ప్రింటింగ్ కార్మికులు కూడా నార్త్ బ్లాక్‌లోని ‘బేస్‌మెంట్’లో కనీసం కొన్ని వారాల పాటు ప్రింటింగ్ ప్రెస్‌లో ఉండవలసి వచ్చేది. ఉద్యోగులను కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచి బడ్జెట్ పత్రాన్ని ముద్రించే పని సంప్రదాయ ‘హల్వా వేడుక’తో ప్రారంభమయ్యేది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌లోనే ఉంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే పని చేస్తుంటారు. ముద్రణ పూర్తి అయ్యాక, బడ్జెట్ పత్రం ముద్రణ సంప్రదాయ ‘హల్వా వేడుక’తో ప్రారంభమయ్యేంది. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరయ్యేవారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బడ్జెట్ కాపీల ముద్రణ తగ్గింది. ప్రారంభంలో, జర్నలిస్టులు, బాహ్య విశ్లేషకులకు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఇఇచ్చే కాపీలను తగ్గించి గ్రీన్ బడ్జెట్ పేరిట డిజిటల్ ప్రతులను సభ్యుల ట్యాబ్ లకు పంపుతున్నారు.

ఈ సంవత్సరం కోవిడ్ 19 కొత్త రూపమైన ఓమిక్రాన్‌పై మరిన్ని పరిమితులు విధించారు. మహమ్మారి కారణంగా సాంప్రదాయ హల్వా వేడుక కూడా రద్దైంది. ఏదేమైనప్పటికీ, బడ్జెట్ పత్రాల సంకలనాన్ని డిజిటలైజ్ చేయడం వలన ఉద్యోగుల చిన్న సమూహం ఒంటరిగా ఉండవలసి ఉంటుంది.

బడ్జెట్ పత్రంలో సాధారణంగా పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రసంగం, ముఖ్యాంశాలు, వార్షిక ఆర్థిక నివేదిక, పన్ను ప్రతిపాదనలతో కూడిన ఆర్థిక బిల్లు, ఆర్థిక బిల్లులోని నిబంధనలను వివరించే మెమోరాండం, స్థూల ఆర్థిక ఫ్రేమ్‌వర్క్ వివరాలు ఉంటాయి. వీటిలో మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ కమ్ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్‌మెంట్, స్కీమ్‌ల ఫలితాల ఫ్రేమ్‌వర్క్, కస్టమ్స్ నోటిఫికేషన్, మునుపటి బడ్జెట్ ప్రకటనల అమలు, రసీదు బడ్జెట్, వ్యయ బడ్జెట్, బడ్జెట్ అంచనాలు ఉన్నాయి.

Read Also…  Viral Video: గ‌గ‌న వీధుల్లో అద్భుత దృశ్యం.. ఈ డ్రోన్ అద్భుతాన్ని చూడ‌డానికి రెండు కళ్లు చాల‌వు..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?