Viral Video: గగన వీధుల్లో అద్భుత దృశ్యం.. ఈ డ్రోన్ అద్భుతాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు..
Viral Video: బుధవారం దేశ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సన వేడుకలు ఎంతో సంబురంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని న్యూఢిల్లీలో వేడుకలు మిన్నంటాయి. ఉదయం రాజ్‌పథ్‌లో భారత సంస్కృతి, సైనిక పటమ ప్రదర్శనను దేశమంతా...
Viral Video: బుధవారం దేశ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సన వేడుకలు ఎంతో సంబురంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని న్యూఢిల్లీలో వేడుకలు మిన్నంటాయి. ఉదయం రాజ్‌పథ్‌లో భారత సంస్కృతి, సైనిక పటమ ప్రదర్శనను దేశమంతా తిలకించింది. ఉదయం వేడుకలు ఇలా జరిగితే సాయంత్రం విజయ్ చౌక్ వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వేల సంఖ్యలో డ్రోన్‌లో గాలిలో విన్యాసాలు చేస్తూ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇండియా మ్యాప్, మహాత్మా గాంధీ, మేకిన్ ఇండియా సింబల్‌తో సహా పలు రూపాల్లో డ్రోన్‌లు విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయాయి. సుమారు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ డ్రోన్ షోను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశ ఖ్యాతిని చాటి చెప్పేలా ఉన్న ఈ డ్రోన్ షోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే… చైనా, రష్యా, బ్రిటన్ తర్వాత వెయ్యి డ్రోన్‌లతో ఇంత పెద్ద ఎత్తున డ్రోన్ షో నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.
ఈ డ్రోన్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ మద్దతుతో, ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన స్టార్టప్ ద్వారా ఆరపరేట్ చేశారు. బాట్లాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి ఈ షోను నిర్వహించింది. మరి నెట్టింట తెగ వైరల్ అవుతోన్న ఈ డ్రోన్ వీడియోను మీరూ ఓసారి చూసేయండి..
#WATCH Drone formations at Vijay Chowk in Delhi on #RepublicDay pic.twitter.com/OGNAenlES3
— ANI (@ANI) January 26, 2022
Also Read: Corona: ఇది ఖచ్చితంగా కరోనాకు అడ్డ..! ప్రభుత్వ హెచ్చరికలు పాటించుకొని ఆ ఏరియా వాసులు..(వీడియో)
నేడు టాటా చెంతకు చేరనున్న ఎయిర్ ఇండియా.. ఇప్పుడు సరికొత్త ప్లాన్‌తో ఆకాశంలోకి..