Update Date of Birth in EPFO: ఇప్పుడు మరింత సులభంగా ఈపీఎఫ్ఓ లో డేట్ ఆఫ్ బర్త్ అప్‌డేట్ చేయొచ్చు.. అదెలాగంటే..

Update Date of Birth in EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) రికార్డులలో పుట్టిన తేదీని అప్‌డేట్ చేయడం

Update Date of Birth in EPFO: ఇప్పుడు మరింత సులభంగా ఈపీఎఫ్ఓ లో డేట్ ఆఫ్ బర్త్ అప్‌డేట్ చేయొచ్చు.. అదెలాగంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 26, 2022 | 10:41 PM

Update Date of Birth in EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) రికార్డులలో పుట్టిన తేదీని అప్‌డేట్ చేయడం మరింత సులభతరం అయ్యింది. EPFO తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో దీని గురించిన పూర్తి సమాచారాన్ని ప్రకటించింది. ఈపీఎఫ్‌ఓ రికార్డులల్లోని వివరాలకు, ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలకు ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదు. రెండు వివరాల మధ్య ఏదైనా తేడా ఉంటే.. ఈపీఎఫ్ క్లెయిమ్ కష్టమవుతుంది. డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి, ఉపసంహరణకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే, EPFO లో పుట్టిన తేదీ తప్పుగా పడినట్లయితే.. దానిని సవరించడం ఇప్పుడు సులభతరమయ్యింది. ఇంట్లో కూర్చుని, మొబైల్ ఫోన్‌లోనే సులభంగా బర్త్ డేట్‌ని సవరించవచ్చు. EPFO ట్వీట్ ప్రకారం.. పుట్టిన తేదీని సరిచేయడానికి, వినియోగదారులు యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లో ఆధార్ లేదా ఇ-ఆధార్‌ను సమర్పించాలి. పుట్టిన తేదీ (DOB)లో మూడేళ్ల కంటే ఎక్కువ తేడా ఉండకూడదు. ఒకవేళ పుట్టిన తేదీలో 3 సంవత్సరాల కంటే ఎక్కువ తేడా ఉంటే, అప్పుడు ఆధార్, ఇ-ఆధార్‌తో పాటు, యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లో పుట్టిన తేదీ ధ్రువీకరణ పేపర్‌ను కూడా సబ్‌మిట్ చేయాలి.

డేట్ ఆఫ్ భర్త్‌ సర్టిఫికెట్‌గా క్రింది పత్రాలను సమర్పించవచ్చు.. పాఠశాల లేదా విద్యా ప్రమాణపత్రం జనన మరణాల రిజిస్ట్రార్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం పాస్‌పోర్ట్. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సర్టిఫికేట్ ఆధారిత కార్డ్. డ్రైవింగ్ లైసెన్స్, ESIC కార్డ్ మొదలైన ప్రభుత్వ శాఖ జారీ చేసిన ఏదైనా పత్రం. సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్.

EPFOలో డేట్ ఆఫ్ బర్త్‌ని ఎలా అప్‌డేట్ చేయాలి.. 1- UAN, పాస్‌వర్డ్‌తో EPFO యూనిఫైడ్ పోర్టల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) 2. ప్రాథమిక వివరాలపై(Basic Details) క్లిక్ చేయండి 3. సరైన ఆధార్ వివరాలను నమోదు చేయండి. UIDAIతో నమోదు చేసిన ఆధార్ వివరాలను సిస్టమ్ క్రాస్ చెక్ చేస్తుంది. 4. ఇప్పుడు చెక్ బాక్స్‌ను టిక్ చేయండి 5. ఆప్‌డేట్‌పై క్లిక్ చేయండి

తర్వాతి పేజీలో పెండింగ్ బై ఎంప్లాయర్ అని వ్రాయబడి ఉంటుంది. రిఫరెన్స్ నంబర్‌తో పాటు, ప్రస్తుత స్థితి, ఇతర వివరాలు కూడా కనిపిస్తాయి. అప్‌డేట్ రిక్వెస్ట్ అంశాన్ని మీరు మీ కంపెనీకి తెలియజేయాలి. రిఫరెన్స్ నంబర్‌ను నోట్ చేసుకోండి. అది తరువాత ఉపయోగపడుతుంది. ఈ పేజీలో, పుట్టిన తేదీతో పాటు, మీరు పేరు, లింగం కూడా మార్చవచ్చు. అయితే, వివరాలన్నీ ఆధార్ ప్రకారమే ఉండాలి.

ఇదిలాఉంటే.. EPFO తన ట్విట్టర్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. EPFO రికార్డులను అప్‌డేట్ చేయడానికి, పుట్టిన తేదీ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలో అన్ని వివరాలను ఈ వీడియోలో వివరంగా పేర్కొన్నారు.

Also read:

Hyderabad:హైదరాబాద్‌ పోలీసుల గొప్ప మనసు.. గ్రీన్ ఛానెల్‌ ద్వారా గుండె, ఊపిరితిత్తుల తరలింపు

Textile: చీరలపై ఐ లవ్ యూ అని ముద్రణ.. వస్త్ర వ్యాపారులపై ప్రజల ఆగ్రహం! చివరికి ఏమైందంటే..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..