Hyderabad:హైదరాబాద్ పోలీసుల గొప్ప మనసు.. గ్రీన్ ఛానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తుల తరలింపు
హైదరాబాద్‌లో రెండు గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు చేసి గుండె, ఊపిరితిత్తుల తరలించారు. సికింద్రాబాద్ యశోద నుంచి మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌కు, బేగంపేట విమానాశ్రయం నుంచి కిమ్స్ హాస్పిటల్‌కు లైవ్ ఆర్గాన్స్ తరలించిన వైద్యులు.
Green Channel in Hyderabad: హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) మరోసారి గ్రేట్ అనిపించుకున్నారు. సాటి మనిషికి ప్రాణం నిలిపే అవకాశం వస్తే.. తాము ఎంత గొప్పగా స్పందిస్తామో మరోసారి నిరూపించుకున్నారు. రెండు గ్రీన్ ఛానెల్‌లను ఏర్పాటు చేసి మనిషి లైవ్ ఆర్గాన్స్‌ను అతి వేగంగా తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసి.. సక్సెస్ అయ్యారు. స్వల్ప సమయంలోనే గుండె, ఊపిరితిత్తులు తరలించేలా చేశారు. మూడు కిలోమీటర్ల దూరాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా 4 నిమిషాల్లో రీచ్ అయ్యేలా పక్కాగా ప్లాన్ చేశారు. గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు ద్వారా బేగంపేట ఎయిర్ పోర్ట్( Begumpet Airport) నుంచి కిమ్స్ ఆసుపత్రికి గుండెను తరలించారు డాక్టర్లు. అలాగే సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి మలక్‌పేట్ యశోద ఆసుపత్రికి ఊపిరితిత్తులను మరో డాక్టర్స్ టీమ్ తరలించింది. 12 కిలోమీటర్ల దూరాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా 12 నిమిషాల్లోనే అంబులెన్స్ రీచ్ అయ్యింది. అంబులెన్స్‌లకు నాన్‌స్టాప్ కదలికను అందించడం కోసం పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. ఇలా హైదరాబాద్ పోలీసుల సహకారంతో రెండు గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు ద్వారా గుండె, ఊపిరితిత్తులను చాలా సులభంగా డాక్టర్లు తరలించగలిగారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా సరే.. పోలీసులు ముందుండి సహయ సహకారాలను అందిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించడం మాత్రమే కాదు.. మనుషులకు ప్రాణాలు పోసేందుకు సహకరిస్తూ.. పోలీసులు తమ మంచి మనసు చాటుకుంటున్నారు.
Also Read: తిరుమల వెంకన్న భక్తులకు TTD గుడ్ న్యూస్.. శుక్రవారం నుంచి అందుబాటులో