Textile: చీరలపై ఐ లవ్ యూ అని ముద్రణ.. వస్త్ర వ్యాపారులపై ప్రజల ఆగ్రహం! చివరికి ఏమైందంటే..
టెక్నాలజీ పుణ్యమా అని ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఐతే తాజాగా రాజస్థాన్‌లో చీరల వ్యాపారం నిర్వహణపై నెట్టింట చర్చలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. చీరల వ్యాపారం చేస్తే అందులో చర్చించడానికి ఏముంటుందనేగా మీ అనుమానం? అక్కడ అమ్ముతున్న..
Protest against the saree written on I Love You: టెక్నాలజీ పుణ్యమా అని ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఐతే తాజాగా రాజస్థాన్ (Rajasthan)లో చీరల వ్యాపారం నిర్వహణపై నెట్టింట చర్చలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. చీరల వ్యాపారం చేస్తే అందులో చర్చించడానికి ఏముంటుందనేగా మీ అనుమానం? అక్కడ అమ్ముతున్న చీరలపై ఉన్న డిజైన్లు అందరికీ అభ్యంతరకరంగా ఉన్నాయట. ఇంకేముంది అంతా కలిసి రోడ్డెక్కి సదరు వస్త్ర వ్యాపారులు అమ్ముతున్న చీరలను వెంటనే నిషేధించాలని నిరసనలను వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో మహిళలు ధరించే చీరలపై వస్త్ర వ్యాపారులు ఐ లవ్ యు (I Love You)అని ముద్రించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ విధంగా రాసి ఉన్న చీరలకు వ్యతిరేకంగా అక్కడి మీనా వర్గీయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. వ్యాపారులు తమ లాభాల కోసం స్థానిక సంస్కృతిని విస్మరించారని నిరసనకారులు ఆరోపించారు. పరికించిచూస్తే సదరు వస్త్ర వ్యాపారులు చేసిన పని ఏ కోణంలో కూడా సరైనదిగా అనిపించలేదు అక్కడి ప్రజలకు. ఈ వ్యవహారంపై మీనా సమాజ్ సభ్యులు తోడభీం సబ్ డివిజన్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. దీంతో ఇలాంటి చీరలను ఇకపై మార్కెట్‌లో విక్రయించబోమని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయబోమని వ్యాపారులు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వ్యాపారులు గ్రామస్తులందరినీ క్షమాపణలు కోరారు కూడా. అనంతరం టెక్స్‌టైల్ ట్రేడ్ బోర్డు సమావేశం నిర్వహించింది. ఏ దుకాణాదారుడు ఈ విధమైన ముద్రణలున్న చీరలు, లూగారీలను అమ్మకూడదని, భవిష్యత్తులో అలాంటి దుస్తులు ఎవరికీ ఆర్డర్ చేయకూడదని వ్యాపారులంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు కూడా.
ఇక ఈ విధమైన దుస్తులు యువతపై తప్పుడు ప్రభావం చూపుతాయని అక్కడి ప్రజలు కలిసికట్టుగా పోరాడి వస్త్ర సంస్కృతిని కాపాడుకున్నారు.
Also Read: