AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Job Alert: ఏపీపీఎస్సీ గ్రూప్ – IV పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఇక మూడు రోజులే మిగిలున్నాయి!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రెవెన్యూ డిపార్ట్‌మెంట్ (గ్రూప్-IV సర్వీసెస్)లో జూనియర్ అసిస్టెంట్-కమ్-కంప్యూటర్ అసిస్టెంట్ (APPSC Jr Asst cum Computer Asst Posts) పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ డెడ్‌లైన్ సమీపిస్తోంది.

APPSC Job Alert: ఏపీపీఎస్సీ గ్రూప్ - IV పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఇక మూడు రోజులే మిగిలున్నాయి!
Online Application
Srilakshmi C
|

Updated on: Jan 26, 2022 | 9:13 PM

Share

APPSC Jr Asst cum Computer Asst Online Application: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రెవెన్యూ డిపార్ట్‌మెంట్ (గ్రూప్-IV సర్వీసెస్)లో జూనియర్ అసిస్టెంట్-కమ్-కంప్యూటర్ అసిస్టెంట్ (APPSC Jr Asst cum Computer Asst Posts) పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ డెడ్‌లైన్ సమీపిస్తోంది. దరఖాస్తు గడువు జనవరి 19తో ముగియనుండగా, నిరుద్యోగ యువత అభ్యర్ధన మేరకు జనవరి 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఎవరైనా ఉండే చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. అభ్యర్ధులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in.లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 670 పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. 18 నుంచి 42 ఏళ్లలోపు వయసున్న అభ్యర్ధులు అర్హులు.

Also Read:

AP Jobs: పదో తరగతి అర్హతతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!