NeoCov Virus: వామ్మో.. పురుడుపోసుకున్న మరో ప్రమాదకర వైరస్.. సోకిన ముగ్గురిలో ఒకరు మృతి..!

NeoCov Virus: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహమ్మారి (Coronavirus) వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో పుట్టుకొస్తున్న సరికొత్త వేరియంట్లు..

NeoCov Virus: వామ్మో.. పురుడుపోసుకున్న మరో ప్రమాదకర వైరస్.. సోకిన ముగ్గురిలో ఒకరు మృతి..!
Neocov
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2022 | 11:54 AM

NeoCov Virus: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహమ్మారి (Coronavirus) వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో పుట్టుకొస్తున్న సరికొత్త వేరియంట్లు అందరినీ వణికిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సరికొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో ‘నియో కోవ్‌’ (NeoCoV) అనే కొత్త రకం వైరస్‌ బయటపడినట్లు వ్యూహాన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీంతో ప్రపంచాన్ని మరో వైరస్ వెంటానే సూచనలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ నియో కోవ్ వైరస్‌ను దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గబ్బిలాల్లో గుర్తించారు. ఇది కూడా కరోనా వైరసే అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు (Wuhan Scientists) పరిశోధనలు జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్‌ ( Russian news agency Sputnik) తన కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఇది జంతువుల (Animal) నుంచి జంతువులకు మాత్రమే సోకుంతుందని.. మళ్లీ ఇది ఎలా రూపాంతరం చెందుతుందో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొత్త వైరస్ పై వెక్టార్‌ వైరస్‌ స్టేట్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ నిపుణులు స్పందించారు. ‘నియో కోవ్‌’పై చైనీస్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయన ఫలితాలు తమకు తెలుసని.. అయితే ప్రస్తుతం ఇది జంతువుల్లో మాత్రమే సోకుతుందని తెలిపారు. దీనిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమంటూ రష్యా శాస్త్రవేత్తలు తెలిపారు.

మనుషులకూ ప్రమాదం.. ఇందులోని ఓ మ్యుటేషన్‌ కారణంగా ఈ నియో కోవ్ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘నియో కోవ్‌’ వైరస్‌కు.. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్‌ – కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ ప్రభావవంతగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీనితో పోలిస్తే మనుషుల్లోని ACE2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వుహాన్‌ యూనివర్శిటీ, బయోఫిజిక్స్‌ ఆఫ్‌ ది చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని అంతర్జాతీయ మీడియా తెలిపారు. అయితే.. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

వ్యాప్తి, మరణాల రేటు ఎక్కువే.. కొవిడ్‌ 19తో పోలిస్తే నియో కోవ్‌ వైరస్‌ ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యాంటీబాడీలు, కొవిడ్‌ 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చని పేర్కొంటున్నారు. అంతేగాక, 2012, 2015లో మధ్య ప్రాశ్చ్య దేశాల్లో విజృంభించిన మెర్స్‌ – కోవ్‌ మాదిరిగా ‘నియో కోవ్‌’తో అధిక మరణాలు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదంటున్నారు.

Also Read:

Coronavirus: భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. భారీగా వెలుగు చూస్తోన్న కేసులు..

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కానీ..