AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wooden Chair: లక్కు తెచ్చిన పాత కుర్చీ.. వందల్లో కొన్న కుర్చీ వేలంలో లక్షల్లో అమ్ముడైన వైనం.. ఎక్కడంటే.

Wooden Chair: అదృష్టం అనేది ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో ఎవరీకి తెలీదు.. లక్ మన తలపులు తట్టినప్పుడు ..దానిని అందిపుచుకున్న వారే నిజమైన అదృష్టవంతులు. అలా ఓ మహిళ లక్ ..టక్‌ టక్‌..

Wooden Chair: లక్కు తెచ్చిన పాత కుర్చీ.. వందల్లో కొన్న కుర్చీ వేలంలో లక్షల్లో అమ్ముడైన వైనం.. ఎక్కడంటే.
Wooden Chair In Uk
Surya Kala
|

Updated on: Jan 28, 2022 | 10:44 AM

Share

Wooden Chair: అదృష్టం అనేది ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో ఎవరీకి తెలీదు.. లక్ మన తలపులు తట్టినప్పుడు ..దానిని అందిపుచుకున్న వారే నిజమైన అదృష్టవంతులు. అలా ఓ మహిళ లక్ ..టక్‌ టక్‌ మని తలుపు తట్టగానే టపీమని తీసింది. లక్షలు తన ఖాతాలో వేసుకుంది.  పాత కుర్చీతో ఏకంగా లక్షదికారి అయిపొయింది ఇప్పుడు బ్రిగ్​టన్(Brighton)కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఓ పాత చెక్క కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు.. అంటే మన కరెన్సీలో 500 రూపాయల వరకూ ఉంటుంది. అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. ఆమె ఇంట్లో ఆ కుర్చీని చూసిన ఆమె దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద రాసిఉన్న డేట్​ చూశాడు. అతనికి ఆసక్తిగా అనిపించి దానిపై స్టడీ చేశాడు.

ఆ కుర్చీ 20వ శతాబ్దానికి చెందిన వియన్నా ఎవంట్​ గార్డే ఆర్ట్​ స్కూల్​కి చెందినదట. ఆస్ట్రియన్​ పెయింటర్​ కోలోమన్​ మోసర్(Austrian painter Koloman Moser)​ 1902లో దానిని డిజైన్​ చేశాడట. మోడ్రన్​ ఆర్ట్​ వర్క్​లో ఆస్ట్రియాలోనే మంచి పేరున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన నిచ్చెన తరహా స్టైల్​లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీనీ రూపొందించారు. ఇదంతా కుర్చీ కొన్న మహిళకు ఆమె బంధువు వివరించడంతో ఆ మహిళ ఆ పాత కుర్చీతో ఓ ప్రముఖ వేలం సంస్థను సంప్రదించింది. వాళ్లు దానిని​ వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్​ దానిని 16,250 పౌండ్లు.. అంటే భారత దేశ  కరెన్సీలో 16 లక్షలకు పైనే చెల్లించి దక్కించుకున్నాడు. కాగా 120 ఏళ్లు గడుస్తున్నా ఆ కుర్చీ ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం.

Also Read:

అయ్యో… ఈ తల్లి ఎలుగుకి ఎన్ని కష్టాలో.. ఓవైపు నవ్వొస్తుంది.. మరోవైపు జాలేస్తుంది

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!