Viral Video: అయ్యో… ఈ తల్లి ఎలుగుకి ఎన్ని కష్టాలో.. ఓవైపు నవ్వొస్తుంది.. మరోవైపు జాలేస్తుంది
ఓ తల్లి ఎలుగు బంటి... తన పిల్లల్ని రోడ్డు దాటించేందుకు చిన్న సైజు యుద్ధమే చేసింది. అది రోడ్డు దాటించేందుకు ప్రయత్నిస్తుండటాన్ని చూసిన వాహనదారులు కాస్త దూరంలో వెహికల్స్ ఆపేశారు. ఆ ఎలుగుబంటి ముందుగా ఓ పిల్లను నోట కరచుకొని రోడ్డు దాటింది.
Mother’s love: సృష్టిలో కల్మషం లేనిది, కల్తీ లేనిది తల్లి ప్రేమ ఒక్కటే.. బిడ్డల రక్షణ కోసం తల్లి ఎంతటికైనా తెగిస్తుంది. అందుకే కన్నతల్లికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు… ఉండదు.. ఇది మనుషులకే కాదు.. పశుపక్ష్యాదులకు వర్తిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎలుగుబంటి(Bear) తన బిడ్డలకు కోసం పడుతున్న తాపత్రయం చూస్తే నవ్వుతూనే ఫిదా అవుతారు. తల్లి ప్రేమను చాటి చెప్పే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో తెగ ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్(Twitter) అకౌంట్ లో డిసెంబర్ 4న పోస్ట్ చేసిన ఈ వీడియోని లక్షల మందికి పైగా వీక్షించారు. ఇందులో ఓ తల్లి ఎలుగు బంటి.. తన పిల్లల్ని రోడ్డు దాటించేందుకు చిన్న సైజు యుద్ధమే చేసింది. అది రోడ్డు దాటించేందుకు ప్రయత్నిస్తుండటాన్ని చూసిన వాహనదారులు కాస్త దూరంలో వెహికల్స్ ఆపేశారు. ఆ ఎలుగుబంటి ముందుగా ఓ పిల్లను నోట కరచుకొని రోడ్డు దాటింది. ఆ సమయంలో మరో పిల్ల.. పరుగెడుతూ తల్లి వెనకాలే వచ్చింది. ఆ వెనకాలే మరో పిల్ల కూడా రోడ్డు క్రాస్ చేసింది. 3 పిల్లలు వచ్చేసినా… మరొకటి రోడ్డుకు అవతల స్తంభం ఎక్కుతుండటం చూసిన తల్లి ఎలుగుబంటి.. తిరిగి అక్కడికి వెళ్లి దాన్ని కూడా తెచ్చేద్దామని వెనక్కి వెళ్తుంది. అంతలో మరో పిల్ల రోడ్డుకు ఇటువైపు వచ్చేసింది. దాంతో తల్లి ఎలుగుకి ఆ రెండింటిలో దేన్ని ముందు పట్టుకుపోవాలో పాలుపోలేదు. చివరకు ఓ పిల్లను అవతలికి తీసుకెళ్లింది. ఆ వెనక మరో పిల్ల కూడా వచ్చి రోడ్డు దాటింది. అలా నాలుగు పిల్లల్నీ సురక్షితంగా రోడ్డు దాటించేందుకు ఆ తల్లి ఎలుగు చాలా కష్టపడుతుంది. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు గానీ… గతేడాది మార్చిలో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తరచూ దీన్ని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ప్రతిసారీ ఇది వైరల్ అవుతూనే ఉంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వడమే కాదు… ఆ తల్లిని మెచ్చుకుంటున్నారు. “తల్లి ఎలుగుకు ఎంత ఓపిక ఉందో” అని ఓ యూజర్ కామెంట్ చెయ్యగా… “వాహనదారులు సహనాన్ని ప్రశంసించాల్సిందే” అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
వీడియో దిగువన చూడండి…
This mother bear trying to get her Cubs across the road … pic.twitter.com/Vzyt2gmmIV
— Science girl (@gunsnrosesgirl3) December 4, 2021
Also Read: Chittoor district: నాటుబాంబును కొరికిన శునకం.. తల ఛిద్రమై స్పాట్‌లోనే మృతి