Viral Video: సంపులో నోట్ల కట్టలు.. నోట్లను ఇస్త్రీ చేసిన అధికారులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియో..
తడిసిపోయిన ఆ నోట్లను స్వాధీనం చేసుకుని హెయిర్ డ్రైయర్లతో ఆరబెట్టి, ఇస్త్రీ చేశారు ఆదాయపన్ను శాఖ అధికారులు. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తడిసిపోయిన ఆ నోట్లను స్వాధీనం చేసుకుని హెయిర్ డ్రైయర్లతో ఆరబెట్టి, ఇస్త్రీ చేశారు ఆదాయపన్ను శాఖ అధికారులు. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ రాయ్ అనే వ్యాపారి ఇంట్లో లెక్కల్లోకి రాని డబ్బు గురించి సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు కోటి విలువైన నోట్ల కట్టలను సంపులో దాచినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు.సంపులో దాచిన ఆ నోట్ల కట్టల బ్యాగును బయటకు తీసిన అధికారులు.. తడిసిపోయిన నోట్లను డ్రైయర్లతో ఆరబెట్టారు. ఇస్త్రీ కూడా చేశారు. ఈ దాడుల్లో శంకర్ రాయ్ నుంచి మొత్తం 8కోట్ల నగదు, 5 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉయదం 5గంటల నుంచి దాదాపు 39 గంటల పాటు ఈ రైడ్స్ జరిగినట్టు.. సోదాలకు నేతృత్వం వహించిన జబల్ పూర్ ఐటీ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ వెల్లడించారు.