Chittoor district: నాటుబాంబును కొరికిన శునకం.. తల ఛిద్రమై స్పాట్‌లోనే మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లాలో నాటు బాంబు కలకలం రేపింది. బాంబు పేలి కుక్క మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.

Chittoor district: నాటుబాంబును కొరికిన శునకం.. తల ఛిద్రమై స్పాట్‌లోనే మృతి
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 28, 2022 | 9:16 AM

country-made bomb: ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో నాటు బాంబు(homemade bomb)కలకలం చెలరేగింది. అడవి పందుల కోసం ఉపయోగించే నాటుబాంబును శునకం నోటితో కొరికింది. బాంబు పేలడంతో  కుక్క తల ఛిద్రమై దుర్మరణం చెందింది. నాటు బాంబును కొరికిన శునకం.. ఘటన స్థలంలో కుప్ప కూలి చనిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో శాంతిపురం పోలీసు ఔట్ పోస్ట్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారి పక్కనే బస్టాండ్ వద్ద దుకాణాల సముదాయం నడుమ భారీ శబ్ధం రావడంతో.. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అనంతరం ఘటనాస్థలిని పరిశీలించి పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని నాటుబాంబులు ఉన్నాయా..? అన్న అనుమానంతో సోదాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసి.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా నాటుబాంబు పేలిన సమయంలో ప్రజలు ఎవరు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

Also Read: భార్యపై ప్రేమతోనే చైన్​స్నాచింగ్​ వైపు.. ఏకంగా సెంచరీ కొట్టాడు.. కీలక విషయాలు