AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australia Kangaroo: యజమానికి జిమ్ ట్రైనర్ గా మారిన కంగారు.. పుషప్స్ చేయిస్తున్న తీరుకు నెటిజన్లు ఫిదా..  

Australia Kangaroo: సోషల్‌ మీడియా(Social Media)లో తరచూ జంతువులకు సంబంధించిన ఎన్నో వైరల్‌ వీడియోలు(Viral Video) మనం చూస్తుంటాం. ముఖ్యంగా పెంపుడు జంతువులు తమను ఎంతగానో..

Australia Kangaroo: యజమానికి జిమ్ ట్రైనర్ గా మారిన కంగారు.. పుషప్స్ చేయిస్తున్న తీరుకు నెటిజన్లు ఫిదా..  
Funny Video Of An Australia Kangaroo
Surya Kala
|

Updated on: Jan 28, 2022 | 12:07 PM

Share

Australia Kangaroo: సోషల్‌ మీడియా(Social Media)లో తరచూ జంతువులకు సంబంధించిన ఎన్నో వైరల్‌ వీడియోలు(Viral Video) మనం చూస్తుంటాం. ముఖ్యంగా పెంపుడు జంతువులు తమను ఎంతగానో ప్రేమించే యజమానులతో ఎంతో సన్నిహితంగా ఉంటాయి. వారితో ఆడుకుంటాయి.. ఆ సమయంలో వాటి చేష్టలు చాలా సరదాగా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. రెండు కాళ్లతో లేచి… తోకతో బ్యాలెన్స్ చేసుకుంటూ… ఊగుతున్నట్లు ఉండే కంగారూలను చూస్తే ఎవరికైనా నవ్వు రావడం సహజం. అలాంటి ఓ పిల్ల కంగారూ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోని చూస్తే మీకు కూడా నవ్వు వచ్చేస్తుంది.

ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోని జనవరి 23న పోస్ట్ చేస్తూ.. “పర్సనల్ ట్రైనర్” అని క్యాప్షన్ పెట్టారు. లక్షలమంది వీక్షిస్తున్న ఈ వీడియోలో ఓ ఇంటి హాల్ లో ఓ వ్యక్తి పుషప్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన పిల్ల కంగారూ… ఆయనకు సాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. ఆయన్ని దగ్గరుండి.. “అదీ అలా చెయ్యాలి… ఊ మళ్లీ మళ్లీ” అంటున్నట్లుగా అతనితో పుషప్స్‌ చేయించింది. ఆ సమయంలో ఆ ఇంట్లోని కుక్క అటుగా వెళ్లింది. ఆ కుక్కని చూసి కూడా కంగారూ కంగారు పడకుండా… అతనితో అలా ఆడుతూనే ఉంది. ఆ వ్యక్తి కూడా ఆ పిల్ల కంగారూ తనను డిస్టర్బ్‌ చేస్తున్నా విసుక్కోకుండా ఎంజాయ్‌ చేశారు. కంగారూ చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.. దీనిపై ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు. “ఓ మంచి ఫ్రెండ్ ఎప్పుడూ నీకు సాయంగా ఉంటారు. ఎప్పుడూ” అని ఓ యూజర్ స్పందించగా… “చాలా అందంగా ఉంది” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

Also Read:  పబ్ లో అమ్మాయిలతో ఆర్జీవి రచ్చ రచ్చ.. బతికితే నీకులా బతకాలి బాసు అంటున్న నెటిజన్లు..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!