Ram Gopal Varma: పబ్ లో అమ్మాయిలతో ఆర్జీవి రచ్చ రచ్చ.. బతికితే నీకులా బతకాలి బాసు అంటున్న నెటిజన్లు..

Ram Gopal Varma: పబ్ లో అమ్మాయిలతో ఆర్జీవి రచ్చ రచ్చ.. బతికితే నీకులా బతకాలి బాసు అంటున్న నెటిజన్లు..
Ram Gopal Varma

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడినా సంచలనమే.. మాట్లాడకపోయినా సంచలనమే.. అసలు ఆర్జీవి(RGV).. ఈ పేరే సిని పరిశ్రమలో ఒక సెన్సేషన్...

Surya Kala

|

Jan 28, 2022 | 11:38 AM

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడినా సంచలనమే.. మాట్లాడకపోయినా సంచలనమే.. అసలు ఆర్జీవి(RGV).. ఈ పేరే సిని పరిశ్రమలో ఒక సెన్సేషన్. వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియోలతో వార్తల్లో నిలిచే వర్మ.. మళ్ళీ తనదైన శైలిలో ఓ వీడియోతో వార్తల్లో నిలిచారు. తాజాగా వర్మ ఓ పబ్ లో మందేసి అమ్మాయితో చిందేస్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో వర్మ చుట్టూ అమ్మాయిలే ఉన్నారు. ఒక అమ్మాయితో పబ్ లో డ్యాన్స్ చేస్తున్న వర్మ.. అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నారు. ఆయన రచ్చ అసలు మాములుగా లేదు. ఆ వీడియోతో పాటు వర్మ పోస్ట్ చేసిన ఫొటోకి క్యాప్షన్ చెబితే అక్షరాల లక్ష రూపాయల బహుమతి ఇస్తానంటూ కూడా వర్మ మరో ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న వర్మ.. మరో చేతితో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు.

వర్మ తాజా సినిమా కొండా ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ.. కొన్ని గంటల్లోనే మళ్ళీ పబ్ లో దర్శనమిచ్చాడు. వర్మ వీడియోకి ఫ్యాన్స్ బతికితే నీకులా బతకాలి బాసు అంటూ కొందరు.. నీకులా లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడం ఎవరీ రాదు అంటూ మరికొందరు ఇలా నెటిజన్లు రకరకాల కామెంట్స్ ను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో హాట్‌హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

Also Read:  దంత క్షయానికి, షుగర్ పేషెంట్స్ కు చక్కటి మెడిసిన్ ఈ సీజనల్ ఫ్రూట్.. జ్యూస్ కంటే.. పండుగా తినడమే బెస్ట్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu